
సివిల్స్‌లో
సిక్కోలు మెరుపులు
సాయి మోహిని మానసకు
వ
ర్యాంకు
జిల్లాకు చెందిన రావాడ సాయి మోహిణి మానస సివిల్స్ ఫలితాలలో 973వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు ప్రకాషరావు, ఉషారాణి ఉద్యోగులు కావడంతో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం ఒకే చోట జరగలేదు. 1 నుంచి 4 వరకు సోంపేటలో వాణీ విద్యానికేతన్, 5వ తరగతి కంచిలి సెయింట్ జోసెఫ్ పాఠశాల, 6నుంచి 10 వతరగతి వరకు శ్రీకాకుళంలోని శార్వాణి విద్యానికేతన్‌లో చదివింది. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంబీబీఎస్ సీటు సాధించి ఆంధ్రామెడికల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి విశాఖలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు విశాఖ ఐఏఎస్ ఆకాడమీలో సివిల్స్‌లో కోచింగ్ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. రెండో ప్రయత్నంలో ప్రిలిమనరీలోనే వెనుదిరిగారు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మూడో ప్రయత్నంలో 973వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మోహినీని డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది, శ్రీకాకుళం నగరానికి చెందిన అంధవరపు సూరిబాబు అభినందించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
సాయి మోహిని మానస ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ఈ స్థాయికి వచ్చేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని చెప్పారు. ఏం చదవాలనే విషయమై ఒత్తిడి తేకుండా నా ఇష్టానికి వదిలేస్తూ ప్రోత్సహించారని తెలిపారు. పేదలకు ఆరోగ్య సేవ చేసేందుకు ప్రభుత్వ వైద్యురాలిగా చేరానని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవ చేసే అవకాశం సివిల్స్ ర్యాంక్ వల్ల దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె మానస తపస్సులా కృషి చేసి మంచి ర్యాంకు సాధించిందని తల్లిదండ్రులు ఉషరాణి, ప్రకాశరావు చెప్పారు. రెండు సార్లు సివిల్స్‌లో అర్హత సాధించనపుడు ఇక ప్రయత్నించవద్దని చెప్పినా పట్టు వీడకుండా చదివి విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. – శ్రీకాకుళం
973

సివిల్స్‌లో