
కూర్మాల
మృత్యుఘోషకు కారణం
గార: పవిత్ర శ్రీకూర్మం దేవాలయ ప్రాంగణంలో నక్షత్ర తాబేళ్లు మృతిచెందడం దురదృష్టకరమని, దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. మృత తాబేళ్ల దహనం ఘటన నేపథ్యంలో మంగళవారం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ తాబేళ్ల పార్కును పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైన క్షేత్రాల్లో శ్రీకూర్మం ఒకటని, ఇక్కడ తాబేళ్లు చనిపోవడం బాధాకరమన్నారు. అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని సంరక్షించడంలో అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని, అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ప్రతీదీ రాజకీయ కోణంలో చూడకుండా తిరుమలలో గోవులు చనిపోవడం వంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం దేవదాయ శాఖ డీసీ సుజాతకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ గొండు రఘురామ్, జెడ్పీటీసీ మార్పు సుజాతమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, బరాటం నాగేశ్వరరావు, పొన్నా డ రుషి, పీస గోపి, చిట్టి జనార్దనరావు, అంబటి శ్రీనివాసరావు, ఎచ్చెర్ల శ్రీధర్, మూకళ్ల తాతబాబు, బగ్గు అప్పారావు, అంధవరపు బాలకృష్ణమూర్తి, మార్పు దుర్గా పృథ్వీరాజ్, కొయ్యాన నాగభూషణం, పీస శ్రీహరిరావు, యాళ్ల నారాయణమూర్తి, రౌతు శంకరరావు, గొలివి వెంకటరమణమూర్తి, పల్ల పెంటయ్య, బరాటం నాగరాజు పాల్గొన్నారు.
తాబేళ్లు లెక్కల్లో తేడా ఎందుకు?
కాంట్రాక్టర్‌ను నిలదీసిన దేవదాయ శాఖ డీసీ
గార: తాబేళ్ల లెక్కల్లో తేడాలు ఎందుకు వస్తాయని, ఎందుకు అంత అశ్రద్ధగా ఉన్నారని దేవదాయ శాఖ డీసీ సుజాత కాంట్రాక్టర్ రమణమూర్తిను నిలదీశారు. తాబేళ్ల దహనం ఘటనపై దేవదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం కూర్మనాథాలయానికి విచ్చేసి ఆరా తీశారు. 2022లో 286 తాబేళ్లుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 212కు ఎలా పడిపోయిందని ప్రశ్నించారు. తాబేళ్లు చనిపోతున్న పరిస్థితుల్లో నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కులో గ్రీనరీ లేకపోవడం వల్లే చనిపోతున్నాయని గ్రీన్‌మెర్సీ ప్రతినిధి రమణమూర్తి తెలపగా, అప్పట్లో ఈవోగా పనిచేసిన ఈవో విజయకుమార్ స్పందిస్తూ గ్రీనరీ తొలగించలేదని, ఇంకా విరివిగా మొక్కలు నాటామని చెప్పారు. తాబేళ్ల పార్కును వాటికి అనుగుణంగా ఆలయంలోని వేరే స్థలంలో నిర్మించాలని డీసీ సుజాతను గార ఎంపీపీ గొండు రఘురామ్ కోరారు. ప్రతి నెలా ఆరోగ్య పరిస్ధితి తెలుసుకోవడం, పశుసంవర్థక శాఖ, అటవీ శాఖ పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్

కూర్మాల

కూర్మాల

కూర్మాల