![దరఖాస](/styles/webp/s3/article_images/2024/11/22/22112024-sud_tab-01_subgroupimage_1317670384_mr-1732217829-0.jpg.webp?itok=mnMm9SW9)
దరఖాస్తుల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ – 2 పరీక్షలకు సన్నద్ధమయ్యే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పాలస్తీనులకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు ఫ్రీ ఫుల్ లెన్త్ మాక్ టెస్ట్‌లు చేపడుతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈమేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ టెస్టులు డిసెంబర్ 2, 3, 9, 10వ తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మైనార్టీ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దేశ ప్రగతికి సైన్స్ దోహదం
కోదాడ: దేశ ప్రగతికి సైన్స్ దోహదపడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో అనంతగిరి, కోదాడ మండల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చెకుముకి టాలెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి సలీంషరీఫ్, డీఎన్. స్వామి, మార్కండేయ, బడుగుల సైదులు, జానకిరామ్, ఖాజామియా, శ్రీనివాసరెడ్డి, లాం దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్లకు
హెల్త్‌కార్డులు ఇవ్వాలి
మఠంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ నాటికి పెన్షనర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటకండ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. గురువారం మఠంపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెన్షనర్ల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. డిసెంబర్ 17న పెన్షనర్ల దినోత్సవాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతా రామయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌రెడ్డి, రాంబాబు, మండల అధ్యక్షులు యాదగిరి, కోటయ్య, సీనియర్ నాయకులు చెన్నాసోమయ్య, దేవదానం వీరారెడ్డి, మోయినుద్దీన్, వీరారెడ్డి, ఎంఎస్‌ఎన్ రాజు, ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, కోటయ్య, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలి
భానుపురి (సూర్యాపేట): సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించే దేశవ్యాప్త నిరసనను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ కోరారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, వెంకటయ్య, దండ వెంకటరెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, గంట నాగయ్య, రాంబాబు, బొడ్డు శంకర్, ధనుంజయ నాయుడు, మట్టిపల్లి సైదులు, బూర వెంకటేశ్వర్లు, కూసుకుంట్ల సైదులు, పోలెబోయిన కిరణ్, సామ నర్సిరెడ్డి, పోరండ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు.
![దరఖాస్తుల స్వీకరణ 1](/gallery_images/2024/11/22/21kdd01-230034_mr-1732217829-1.jpg)
దరఖాస్తుల స్వీకరణ
![దరఖాస్తుల స్వీకరణ 2](/gallery_images/2024/11/22/21hzr105-230030_mr-1732217829-2.jpg)
దరఖాస్తుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment