సూర్యాపేట: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అయ్యేంత వరకూ పోరాటం ఆగదని మహాజన సోషలిస్టు పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 9 నుంచి సూర్యాపేటలో నిరవధిక దీక్షలు చేపట్టారు. 5వ రోజైన గురువారం నిర్వహించిన దీక్షల్లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. దీక్షకు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి శ్రీకాంత్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గంట భిక్షపతి, పనికేర గణేష్, వల్దాసు నాగేంద్రబాబు, సిరపంగి లింగస్వామి, నాగార్జున, చింత మధు, పంతం లింగన్న, బీసీ నాయకులు పవన్ పాల్గొన్నారు.