పాలకవీడు: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ అప్పారావు ఆదేశించారు. పాలకవీడు మండల కేంద్రలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెటంట్లతో తాగునీరు సమస్యలు, ఉపాధి పనులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి అడిగిన ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా కార్యాలయాల్లో కూర్చుని రికార్డుల్లో నమోదు చేయడడం లాంటివి చేయొద్దన్నారు. నర్సరీల్లో గ్రీన్ నెట్ ఏర్పాటు చేసుకోవాలని, క్రమం తప్పక మొక్కలకు నీరందించాని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ రాజు, కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల పక్షాన పోరాడుతాం
చిలుకూరు: ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలోని సీపీఐ భవన్‌లో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1న నారాయణపురం గ్రామ శాఖ మహాసభతో ప్రారంభంకానున్న జిల్లా మహాసభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, నాయకులు సాహెబ్ అలీ, కె.వెంకటయ్య, రెమిడాల రాజు, పిల్లుట్ల కనకయ్య, దొడ్డా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన
మఠంపల్లి: మండలంలోని రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 247లో ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గురువారం జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రఘునాథపాలెం వద్ద వ్యవసాయ కళాశాల నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని, దీంట్లో భాగంగా స్థల పరిశీలన చేశామని నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నరేష్, తహసీల్దార్ మంగా, ఏడీఏ రవినాయక్, ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారికి మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి