
యువ న్యాయవాదులు వృత్తినైపుణ్యం సాధించాలి
చివ్వెంల: యువ న్యాయవాదులు వృత్తిలో నైపుణ్యం సాధించాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్‌శ్రీ అన్నారు. యువ న్యాయవాదులకు చేయూత నందించాలనే ఉద్దేశంతో గురువారం సూర్యాపేట జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదులు పొదిల ప్రదీప్‌కుమార్, గోండ్రాల అశోక్ బహూకరించిన మూడు కంప్యూటర్లు, మూడు ప్రింటర్లను జిల్లా ఇన్‌చార్జి ప్రధాన జడ్జి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూనియర్లకు సహకారం అందిస్తున్న సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువ న్యాయవాదులు వాటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు. కంప్యూటర్లు అందబాటులో ఉండటం వల్ల తమ పిటిషన్లను త్వరగా తయారు చేసుకుని కోర్టులో వేసుకోవచ్చని సూచించారు. దీంతో సమయం వృథాకాకుండా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దాతలను యువ న్యాయవాదుల సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి శ్యామ్‌శ్రీ