
లేడీ సూపర్‌స్టార్ నయనతార తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ బాద్‌షా షారూక్‌ఖాన్‌తో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈమె నటించి నిర్మించిన కనెక్ట్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఆశించిన విజయం సాధించకపోయినా ఇదో విభిన్న ప్రయత్నం. అయితే ఇటీవల నయనతారకు అవకాశాలు తగ్గాయని, ఆమె కూడా నటనకు స్వస్తి చెప్పి చిత్ర నిర్మాణ రంగంపై దృష్టి పెట్టబోతున్నార నే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
అయితే అదంతా ఒక ప్రచారం మాత్రమే. వాస్తవానికి నయనతార చిన్న గ్యాప్ తీసుకున్నారంటే. కవల పిల్లలకు తల్లి అవడం అదే విధంగా తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజా చిత్రం మిస్ కావడంతో కొంత గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా మళ్లీ నటిగా విజృంభించడానికి సిద్ధమయ్యారు. ఆమె నటిస్తున్న 75వ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా శనివారం చైన్నెలో ప్రారంభమైంది. ఇది ఆమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. తాజాగా మరో భారీ చిత్రానికి కూడా నయనతార గ్రీన్ సిగ్న్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నయనతారతో పాటు నటుడు మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
దీనిని నిర్మాత వై నాట్ శశి స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఈయన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారన్నమాట. ఇది క్రికెట్ క్రీడ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. దీనిని ది టెస్ట్ అనే పేరును నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment