యోగేష్, కమలేష్
సాక్షి, చైన్నె: పంజాబ్ సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన తమిళవీరులకు నివాళులర్పించారు. వీరి ఇద్దరి మృతదేహాలకు శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పంజాబ్‌లోని సైనిక శిబిరంలో బుధవారం జరిగిన కాల్పుల్లో తమిళనాడులోని తేని జిల్లా దేవారం సమీపంలోని మూనాండి పట్టికి చెందిన యోగేశ్‌కుమార్, సేలం జిల్లా వానంకాడకు చెందిన కమలేష్ మరణించిన విషయం తెలిసిందే.
ఈ సమాచారంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. వీరి మృతదేహాల కోసం కుటుంబీకులు, ఆ గ్రామస్తులు ఎదురు చూశారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆర్మీ వర్గాలతో మదురై విమానాశ్రయానికి యోగేశ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో అధికారుల నివాళుల అనంతరం భౌతికకాయాన్ని రోడ్డు మార్గంలో తేనికి తరలించారు. స్వగ్రామంలో ఉంచారు. బంధువులు, ఆప్తుల సందర్శనానంతరం స్థానిక శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
వివాదం..
కమలేష్ భౌతికకాయం తరలింపు వివాదానికి దారి తీసింది. కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి ప్రభుత్వ మార్చురీ అంబులెన్స్‌లో తరలించారు. అంబులెన్స్ వెంట ఏ ఒక్క ఆర్మీ అధికారి లేకపోవడంతో గ్రామస్తులలో ఆగ్రహం బయలు దేరింది. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత తప్పలేదు. చివరకు పోలీసులు అధికారులు బుజ్జగించారు. ఆర్మీ వర్గాల అంబులెన్స్ వచ్చినానంతరం భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించారు. సాయంత్రం కమలేష్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. కమలేష్ తండ్రి రవి డీఎంకే నాయకుడి కావడం వల్లే ఆయన కుమారుడికి ఆర్మీ వర్గాలు సరైన గౌరవం ఇవ్వలేదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment