ఆదాయపు పన్ను శాఖకు అప్పగింత
అన్నానగర్: చైన్నె సమీపంలో ఆదివారం ఎన్నికల ఫ్‌లైయింగ్ స్క్వాడ్ జరిపిన వాహనాల తనిఖీల్లో సీజ్ చేసిన రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ఆదాయపు పన్ను శాఖకు సోమవారం అప్పగించారు. వివరాలు.. శ్రీపెరంబత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్ సమీపంలోని వండలూరు – మీంజూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించింది.
ఆ సమయంలో చైన్నె విమానాశ్రయం నుంచి సరుకులు తీసుకెళ్తున్న ప్రైవేట్ ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన మినీ లారీలో బంగారు కడ్డీలు ఉండడంతో శ్రీపెరంబదూరు పార్లమెంట్ నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి శరవణ కన్నన్ సీజ్ చేశారు. వాటిని సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్, శరవణ కన్నన్ సమక్షంలో చైన్నెకి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వీటి విలువ మార్కెట్లో రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. తగిన ధ్రువపత్రాలు అందిస్తే కలెక్టర్ నేతృత్వంలో ప్రైవేట్ కొరియర్ కంపెనీకి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment