క్లుప్తంగా
ఆత్మహత్యకు
యత్నించిన మహిళ మృతి
తిరువళ్లూరు: పొరుగు ఇంటి మురికినీటిని తమ ఇంటిపైకి వదులుతున్నారనే విషయంపై గొడవ పడి ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కై వండూరు గ్రామానికి చెందిన పొన్ని(38) ఇంటికి సమీపంలోనే సంధ్య కుటుంబం నివాసం ఉంటోంది. సంధ్య ఇంటి నుంచి మురికినీరు తరచూ పొన్ని ఇంటి వద్దకు రావడంతో ఇరు కుటుంబాలు తరచూ ఘర్షణ పడేవారు. ఇదే విషయంపై రెండు కుటుంబాలు గత 9న ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పొన్ని ఇంట్లో కిరోసిన్‌ను తెచ్చి సంధ్య ఇంటి ముందు ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ సంఘటనలో పొన్ని తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను చైన్నెలోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పొన్ని బుధవారం రాత్రి మృతి చెందింది. ఈ సంఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాలువలో పడి చిన్నారి...
అన్నానగర్: కరూర్ జిల్లా వాటర్ బ్రిడ్జి గ్రామానికి చెందిన గణపతి భార్య చిత్ర. ఈ దంపతులకు 3 ఏళ్ల పాప ఉంది. కొన్ని నెలల క్రితం కుక్క కాటుకు గురై చిన్నారి మృతి చెందింది. తదనంతరం గణపతి–చిత్ర దంపతులు 3 నెలల క్రితం దిండిగల్ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆశ్రమం ద్వారా కిషాంత్(1.5సంవత్సరం) అనే బిడ్డను దత్తత తీసుకున్నారు. వారి ఇల్లు తెన్‌కరై నీటిపారుదల కాలువ ఒడ్డున ఉంది. బుధవారం చిత్ర పాప కిషాంత్‌కు ఆహారం తినిపించింది. తర్వాత ఎప్పటిలాగే చిన్నారిని ఇంటి ముందు ఆడుకోవడానికి వదిలి చిత్ర పనిమీద ఇంటి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో కిషాంత్ సాగునీటి కాలువలో దిగినట్లు తెలుస్తోంది. ఇందులో అతను నీటిలో మునిగిపోయి చనిపోయాడు. సుమారు గంటపాటు వెతికిన తర్వాత కిషాంత్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
రైలు ఢీకొని యువతి...
అన్నానగర్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన హరిశెట్టి వెంకటరమణ కుమార్తె కల్యాణి(23). ఈమె చైన్నెలోని రాయపురంలో తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటూ సైదాపేటలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పని చేస్తోంది. బుధవారం సాయంత్రం పని ముగించుకుని వస్తుండగా గిండి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటేందుకు కల్యాణి ప్రయత్నించింది. ఆ సమయంలో తాంబరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో కల్యాణి తీవ్రంగా గాయపడింది. అక్కడికక్కడే మృతి చెందింది. మాంబలం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాచకుడి హత్య
అన్నానగర్: చైన్నెలోని శాంతోమ్ క్రిస్టియన్ చర్చి తలుపు బయట సుగు(62) అనే యాచకుడు కూర్చుని రోజూ అడుక్కుంటున్నాడు. గత 15 ఏళ్లుగా అక్కడ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రిపూట అక్కడే పడుకునేవాడు. ఈ స్థితిలో గత 17వ తేదీ రాత్రి సుగు అదే స్థలంలో నిద్రిస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు సుగును కొట్టి నిద్ర లేపారు. భిక్షాటన చేసి పొదుపు చేసిన డబ్బును దోచుకోవడానికి ప్రయత్నించారు. సుగు డబ్బు ఇవ్వకుండా వారితో పోరాడాడు. వారి నుంచి తప్పించుకునేందుకు దాచిన బ్లేడ్‌తో వారి చేతిని చీల్చాడు. దీంతో ఆగ్రహించిన దుండగులు సుగు తలను గోడకు కొట్టారు. తలకు బలమైన గాయాలైన సుగు అక్కడే రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సుగు బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మైలాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. హంతకుల కోసం వెతుకుతున్నారు.
వండలూరు జూలో కోతి మృతి
అన్నానగర్: చైన్నె సమీపంలోని వండలూరు అ రింజ్ఞర్ అన్నా జూలో పెద్ద సంఖ్యలో జంతువులు, పక్షులు సంరక్షించబడుతున్నాయి. ఈ స్థితిలో వే లూరు కోట్టం నుంచి తీవ్ర గాయాలతో బయట పడ్డ ఆడ కోతి పిల్లను అక్టోబర్ 26న చికిత్స ని మిత్తం వండలూరు జూ ఆస్పత్రిలో చేర్చారు. జూ లోని వన్యప్రాణి వైద్య బృందం కోతికి చికిత్స చేసింది. ఈ బృందం ఆ కోతి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. గత 2 రోజులుగా కోతి అలసిపోయి కనిపించింది. తమిళనాడు వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ నిపుణులను సంప్రదించి తగిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ కోతి పిల్ల బుధవారం రాత్రి మృతి చెందింది.
గంజాయి తరలిస్తూ
పట్టుబడ్డ భార్యాభర్త
తిరువొత్తియూరు: దిండివనం సమీపంలో గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిండివనం సమీపలోని మన్నార్ సామి కోవిల్ సమీపంలో బ్రహ్మదేశం ఇన్‌స్పెక్టర్ ప్రకాష్, సబ్ ఇన్‌స్పెక్టర్ కామరాజు నేతృత్వంలో పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన భార్యాభర్తలను పోలీసులు తనిఖీ చేశారు. వారు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో వారిని తనిఖీ చేస్తుండగా ఇద్దరూ పోలీసులను తోసి అక్కడి నుంచి వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని చుట్టుముట్టి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేశారు. విచారణలో వారు గంజాయి అక్రమంగా తీసుకువచ్చి పుదువై, దిండివనం ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. నరికురవర్ కాలనీకి చెందిన భవాని, ప్రకాష్ అనే దంపతులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పరిచి వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్, 2 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment