రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఆమేనా?
తమిళసినిమా(చైన్నె): దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. రెండు ఆస్కార్ అవార్డులను ఒకేసారి గెలుచుకుని ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు. అలాంటి ఏఆర్ రెహమాన్ సైరాభాను దంపతులు విడిపోతున్నట్లు ప్రకటన రావడంతో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అది కూడా ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాభాను ఎంతో బాధతో వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీరు విడిపోవడానికి గాయని మోహిని డే కారణమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కారణం ఈమె ఏఆర్ రెహమాన్ సంగీత బృందంతో కలిసి దేశ విదేశాల్లో 40 సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సైరాభాను భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్ది సమయంలోనే గాయని మోహినిడే కూడా తన భర్త మార్క్ పెచ్చు నుంచి విడిపోతున్నట్లు తన ఇన్‌స్ట్రాలో ప్రకటించడం కూడా రకరకాల చర్చకు దారితీస్తోంది. ఇమె గిటారిస్టు కూడా. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ సంగీత బృందంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ సంగీత బృందంలో ఆయనకు నచ్చిన సంగీత కళాకారుల్లో ఈమె కూడా ఒకరు. ఏఆర్ రెహమాన్ నుంచి సైరాభాను విడిపోవాలని తీసుకున్న నిర్ణయానికి మోహినీ డే కారణమా అన్న సైరా భాను తరుపు న్యాయవాది వందన షా బదులిస్తూ అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. అసలు ఏ ఆర్ రెహమాన్ సైరాభాను విడిపోవడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు అలాంటిదే ఏదైనా ఉన్నా, తనకు తెలిసినా తాను చెప్పకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా సైరాభాను ఏఆర్ రెహమాన్ నుంచి జీవనభరణం కోరతారా? అన్న ప్రశ్నకు కేసు అక్కడి వరకు రాలేదని, అయితే ఆమె జీవన భరణం కోరే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment