ఉత్సాహంగా చిన్నారుల సైకిల్ ర్యాలీ
సేలం : భారత క్రీడా కమిటీ తరఫున ప్రజలలో శరీర ఆరోగ్య ఆవశ్యకతను శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సేలంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున ఫిట్ ఇండియా మెషిన్ పేరుతో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా చోట్ల సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించి శారీరక ఆరోగ్యం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అందులో భాగంగా సేలంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో చిన్నారుల నుంచి పెద్దల వరకు పాల్గొని ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కడంపై అవగాహన కల్పించారు. సేలం మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ హ్యాంగింగ్ పార్క్ గాంధీ రోడ్డు మీదుగా అస్తంపట్టి రౌండ్ వరకు సాగి ఈ ర్యాలీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ముగిసింది. ఇందులో పాల్గొన్న వారందరికీ స్పోర్ట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment