ఐఐటీ మద్రాసులో.. గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం
● ప్రతి ప్రోగ్రాంకు రెండు సీట్ల కేటాయింపు
సాక్షి, చైన్నె: వివిధ విద్యాపరమైన సబ్జెక్టులు, నైపుణ్యాలలో విద్యార్థులను అంచనా వేసి, జాతీయ, అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాసు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ప్రవేశాలను ప్రారంభించింది. ‘సైన్స్ ఒలంపియాడ్ ఎక్స్‌లెన్స్‌గా పిలువబడే, ఈ ప్రవేశం 2025–2026 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ (అడ్వాన్స్‌డ్) వ్యవస్థకు వెలుపుల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు ఐఐటీ మద్రాసు సోమవారం ప్రకటించింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్లు, ఫైనార్ట్స్, కల్చర్ ఎక్సలెన్స్ మోడ్స్ ద్వారా జరిగే ప్రవేశాల మాదిరిగానే సైన్స్ ఒలంపియాడ్ ఎక్సలెన్స్‌లో ప్రతి ప్రోగాంకు రెండు సూపర్ న్యూమరీ సీట్లు ఉంటాయని, ఇందులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయించినట్టు ప్రకటించారు.ఈ ప్రవేశం నిమిత్తం 12వ తరగతి ఉత్తీర్ణత, అర్హత ప్రమాణం, వయస్సులు సంబంధిత సంవత్సరం కోసం జేఈఈ (అడ్వాన్స్‌డ్) తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇది వరకు ఐఐటీ ప్రవేశాల పొంది ఉండేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నామని , సమగ్ర వివరాలు htt pr://ufadmirrionr.iitm.ac.in/rcope వెబ్ సైట్‌లో లభిస్తాయని వివరించారు. ఈసందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్పవైన పజిల్స్ అనేవి పాఠ్య పుస్తకాలను గుర్తు పెట్టుకోవడం ద్వారా పరిష్కరించబడలేదన్నారు. అయితే, ఒక్కొక్క భాగాన్ని విడదీయడానికి సాహసం చేసి, భవిష్య తరాల కోసం కొత్త అద్భుతాలను సృష్టించడం ద్వారా పరిష్కరించ బడ్డాయని పేర్కొన్నారు. ఈ కలతో సైన్స్ ఒలంపియాడ్స్‌లో శ్రేష్టతను ప్రదర్శించిన అభ్యర్థుల కోసం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ప్రవేశాలు అందించడం ద్వారా ఐఐటి మద్రాస్ మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేయవలసిందిగా ఒలంపియాడ్స్‌లో విజయం సాధించిన దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పిలుపునిస్తున్నామన్నారు కాగా, ఏరో స్పెస్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, భౌతికశాస్త్రం, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఓషన్ ఇంజినీరింగ్,వైద్య శాస్త్రం, సాంకేతికత, రసాయన శాస్త్రంలలో ప్రతి విభాగంలోనూ రెండు చొప్పున కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment