విజయవంతంగా తమిళ న్యాయ సదస్సు
సాక్షి,చైన్నె : చైన్నెలో రెండు రోజుల పాటుగా అంతర్జాతీయ తమిళ న్యాయ సదస్సు –2025 విజయంతంగా జరిగింది. వినాయక మిషన్ లా స్కూల్, గ్లోబల్ తమిళ లా సెంటర్ లు అంతర్జాతీయ తమిళ న్యాయసదస్సును పయనూర్‌లోని క్యాంపస్‌లో నిర్వహించాయి. తమిళ భాష, సంస్కృతి, ప్రపంచీకరణ యుగంలో చట్టపరమైన అంశాల గురించి న్యాయ నిపుణులు, ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించారు. తమిళ న్యాయ సంప్రదాయాల పరిణామ పాత్రను చర్చించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, నిపుణుల ప్యానెల్ చర్చలు, ముఖ్య ఉపన్యాసాలు, వంటి అనేక అంశాలను ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండురోజుల సదస్సులో సాంఘిక సంక్షేమ శాఖమంత్రి గీతా జీవన్, ఆ విద్యా సంస్థ డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్, మనోన్మణియం సుందరనార్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ కె. చోక్క లింగం, డాక్టర్ అబ్దుల్ కలాం విజన్స్ 2020 అధ్యక్షుడు తిరుచంద్రన్, తమిళనాడు రాష్ట్ర అధికార భాషా కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ ఎం. ముత్తువేల్, ప్రముఖ న్యాయ నిపుణులు మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పి. విల్సన్, మద్రాస్ హైకోర్టుకు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ ఎస్. విమల తదితరులు హాజరయ్యారు. ముగింపు సమావేశంలో ఉత్తమ ఐదు ఉత్తమ ప్రజెంటర్లను గుర్తించి, సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ చాన్స్‌లర్ డాక్టర్ ఏఎస్ గణేషన్, ఉపాధ్యక్షులు అనురాధ గణేషన్, బోర్డుసభ్యులు సురేష్ శామ్యుల్, అసిస్టెంట్ డీన్ ఫౌమినా, అసిస్టెంట్ ప్రొఫెసర్ శరవణన్ రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment