కోలాహలం..సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం
వేలూరు: కాట్పాడి సమీపంలోని వళ్లిమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని మంగళవారం కోలాహలంగా నిర్వహించారు. వేలూరు జిల్లాలోనే వళ్లిమలై సుబ్రమణ్యస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆలయంలో మాసి మాసం పురష్కరించుకుని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహా రథోత్సవం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. రథోత్సవాన్ని రాష్ట్ర మంత్రి దురై మురుగన్, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ మహారథోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై రథంపై బొరుగులు, మిర్యాలు చల్లి రథాన్ని లాగుతూ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని పురష్కరించుకుని వళ్లిమలై ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా ఉదయం ఆలయంలో స్వామి వార్లకు తిరుకల్యాణోత్సవం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక అలంకరణలు చేసి రథంలో స్వామివారిని ఆశీనులను చేశారు.
Comments
Please login to add a commentAdd a comment