స్కూళ్ల భోజన సిబ్బంది ఆందోళన
● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బంది న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘం జిల్లా అధ్యక్షుడు శివ, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న మధ్యాహ్న భోజనం తయారీ పోస్టులను శాశ్వత నియామకం ప్రాతిపదికన వెంటనే భర్తీ చేయాలని, శాశ్వత ఉద్యోగులను నియమించాలని, పాత పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేసి కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు వెంకటేషన్, మలర్‌కొడి, సతీష్‌కుమార్, సులోచన, రాజేంద్రన్, ధనసుందరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment