సూర్యకాంతం నటన అనితరసాధ్యం | - | Sakshi
Sakshi News home page

సూర్యకాంతం నటన అనితరసాధ్యం

Published Thu, Dec 19 2024 10:10 PM | Last Updated on Thu, Dec 19 2024 10:10 PM

సూర్యకాంతం నటన అనితరసాధ్యం

సూర్యకాంతం నటన అనితరసాధ్యం

వర్ధంతి సభలో కొనియాడిన వక్తలు

కొరుక్కుపేట: వెనుకటి తరం మహానటి సూర్యకాంతం నటన అనితరసాధ్యమని ఆమె వర్థంతి సభలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) ఐక్యూఏసీ, సృజన తెలుగు భాషా మండలి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి యువ విభాగం సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఎస్‌.కె.పి.సి. ఆడిటోరియం వేదికగా మహానటి సూర్యకాంతం శత వర్ధంతి సందర్భంగా గుడిమెళ్ల మాధురి శిక్షణలో విద్యార్థులు రూపొందించిన నవరస నటశిఖామణి దృశ్య శ్రవణ మాలికను ప్రదర్శించారు. అనంతరం ప్రారంభమైన వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీనటి కుట్టి పద్మిని, తెలుగు సినీ చరిత్రకారుడు ఎస్వీ రామారావు, ఆత్మీయ అతిథులుగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా డాక్టర్‌ కనిగెలుపుల శంకర రావు ,సూర్యకాంతం కుమారుడు, కోడలు డా. అనంత పద్మనాభమూర్తి , ఈశ్వరీ రాణిలు, ప్రముఖ హాస్య రచయిత్రి జోస్యుల ఉమా, ఎస్‌కేపీసీ కరస్పాండెంట్‌ ఊటుకూరు శరత్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి మోహన శ్రీ, తెలుగు శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీఎస్‌ మైథిలీ తదితరులు పాల్గొని తెలుగు చిత్ర సీమలో తన నటన ద్వారా పాత్రలలో జీవించిన సూర్యకాంతాన్ని కొనియాడారు. ముందుగా నటి కుట్టి పద్మిని మాట్లాడుతూ తాను బాలనటిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వర రావు, సావిత్రి సూర్యకాంతం, దేవిక, ఎస్‌ వి రంగారావు, రేలంగి తదితర మహానటులతో ఉన్న పరిచయాలను వేదికపై గుర్తు చేసుకున్నారు. తెలుగు పాటలు, పద్యాలు వినసొంపుగా ఉంటాయని, తెలుగు మాట్లాడుతున్నప్పుడు మరుపురాని అనుభూతిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు మెమొంటోలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ వర్ధంతి సభలో కల్పన గుప్తా, గుర్రం బాలాజీ, శ్రీనివాస రాజు, శివరామ ప్రసాద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement