చెక్!
ఆటోల దోపిడీకి
● ఇక డిజిటల్ మీటర్లకు మంగళం
● ప్రత్యేక యాప్‌తో చార్జీల వసూలు
● ప్రభుత్వానికి చేరిన సిఫార్సు
● త్వరలో అమల్లోకి..
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, తిరు చ్చి, మదురై, తిరునల్వేలి తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పనిసరి చేసిన వి షయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వమే చార్జీలను తొలుత నిర్ణయించింది. ఈ సమయంలో కనిష్ట చార్జీగా రూ. 25, ఆతర్వాత ప్రతి కి.మీ దూరానికి అదనంగా రూ. 12గా నిర్ణయించారు. రాత్రుల్లో 50 శాతం మేరకు చార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. కొంత కాలం పాటు ఆటో వాల నడ్డి విరిచే విధంగా ఈ చార్జీల అమలు మీద దృష్టి పెట్టారు. అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించడంతో ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు కొంత కాలం సజావుగా అమలైంది. ఆతదుపరి కాలక్రమేనా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతంగా పెరగడం వెరసి మీటర్లు వేసే ఆటో డ్రైవర్లు కరువయ్యారు. వారు నిర్ణయించిన చార్జీని ప్రయాణికులు చెల్లించుకోక తప్పలేదు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, జన సంచార ప్రదేశాలలో చార్జీల దోపిడీ మరీ ఎక్కువే అన్నట్టుగా పరిస్థితి సాగుతూ వచ్చింది. ఓలా, ఉబర్ వంటి యాప్ లద్వారా ఆటోలను బుక్ చేసుకున్న వారు సైతం డ్రైవర్లు అదనంగా అడిగిన మొత్తాన్ని చెల్లించుకోక తప్పలేదు. ఈ వ్యవహారాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇక, డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీల మీద దృష్టి పడింది. ఆటో వాల వసూళ్లపై ఫిర్యాదులు హోరెత్తాయి. దీంతో చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు తగ్గ సిఫారసును ప్రభుత్వానికి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అధికారలు పంపించారు. కార్మిక సంఘాలు, ఆటో సంఘాలతో రవాణా,కార్మిక సంక్షేమ కమిషనరన్లు చైన్నెలో సమావేశమయ్యారు.
డిజిటల్‌కు స్వస్తి..
చైన్నెలో ఆటో కార్మికుల సమావేశంలో చార్జీలపై తుది నిర్ణయం తీసుకుని సిఫార్సులను అధికారులు ప్రభుత్వానికి పంపించడం బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ మీటర్లకు స్వస్తి పలికేందుకు నిర్ణయించారు. ఆ మీటర్లను పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీ ఆధారంగా మొబైల్‌యాప్ ద్వారా ఆటో రవాణా సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టారు. రవాణాశాఖ తరపున స్టార్టప్, ప్రైవేటు సంస్థల సంయుక్తంగా ప్రత్యేక యాప్ రూపకల్పన కసరత్తులు జరుగుతున్నాయి. ఆటో పాత చార్జీలకు బదులుకు కొత్తగా చార్జీలను నిర్ణయించి ఉన్నారు. ఇందులో తొలి కనిష్ట చార్జీగా రూ. 50, ఆ తర్వాత కిలో మీటరకు రూ. 25 చొప్పున చార్జీ వసూళ్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కొత్త చార్జీల వివరాలను ప్రభుత్వానికి అందించారు. దీనిపై సమగ్ర పరిశీలన మేరకు త్వరలో అధికారికంగా చార్జీలను ప్రకటించనున్నారు. దీనిని అమలు చేయించ డం మళ్లీ అధికారులకు కష్టతరకావడం ఖాయం. కొన్ని సంఘాలు సుముఖంగా ఉన్నా, మరికొన్ని సంఘాలు, ఇతర ప్రాంతాలలో ఈ చార్జీల అమలుకు పోలీసులు మళ్లీ కొరడా ఝుళిపించక తప్పదు. అదే సమయంలో ప్రస్తుతం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా రాయితీతో ఆటోల పంపిణీని ప్రభు త్వం విస్తృతం చేసిన విషయం తెలిసిందే. ఈ చార్జీల అమలుపై మహిళా ఆటో డ్రైవర్లు తొలి ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. మహిళ పింక్ ఆటోల ద్వారా అబలకు మరింత భద్రత కల్పించే విధంగా ఈ యాప్‌లో మరిన్ని అంశాలను కేంద్రీకరించనున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment