చైన్నె వేదికగా సంగం ఫెస్టివల్
● ఈనెల 31న నిర్వహణ
సాక్షి, చైన్నె: బాలాదేవి చంద్రశేఖర్ కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ నేతృత్వంలో చైన్నె వేదికగా ‘సంగం ఫెస్టివల్’కు నిర్ణయించారు. ఇండియన్ క్లాసికల్, గ్లోబల్ హార్మొనీ ద్వా రా సంస్కృతులను ఏకం చేయడం లక్ష్యంగా సంగం ఫెస్టివల్ జరగనుంది. భరతనాట్య కళాకారులు బాలా దేవి చంద్రశేఖర్ స్థాపించి, విజేతగా నిలిచిన సంగం ఫెస్టివల్ కేవలం కళాత్మక కార్యకలాపాలకు మించిన దిగా ఉంటుందని నిర్వాహకులు బుధవారం స్థానికంగా ప్రకటించారు. భారతదేశంలోని కళల సంఘానికి విజ్ఞానం, ప్రచారం, సూచనలు, తిరుగులేని మద్దతు ను అందిస్తూ విసృతమైన వనరుల కేంద్రంగా ఉన్న ట్టు వివరించారు. కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ సహకారంతో ఈ సంవత్సరం ఉత్సవంలో తంజావూరు హెరిటేజ్ అవు ట్స్, క్రియేటివ్ సినర్జీకి చెందిన గురువు తంజావూరు హరిహరన్ హెరంబనాథన్ రచించిన తంజావూరు క్వార్టెట్ సంబంధించిన అరుదైన కంపోజిషన్‌లు ఉంటాయని పేర్కొన్నారు. సోలో థిమాటిక్ డ్యాన్సర్, గే య రచయితలు, సంగీత స్వరకర్త రాజ్‌కుమార్, గోపి కా వర్మ ద్వారా సంగం ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా భారతదేశం, దక్షిణాసియాలోని విభిన్న ప్రాంతాల నుంచి భారతీయ శాసీ్త్రయ సంగీతం, నృత్యాల కలయికకు దర్పణంగా నిలుస్తుందన్నారు. ప్రదర్శనలు, ఉపన్యాసాలు, వర్క్‌షాప్‌లు, డిజిటల్ వనరులు, మార్గదర్శకత్వం, కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ముందుకెళ్తామన్నారు. బాలా దేవి చంద్రశేఖర్ తన భరతనాట్యం ప్రతిభను మెరుగు ప రుచుకుంటూ, 25 సంవత్సరాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. సంగం ఫెస్టివ ల్ పాల్గొనే వారందరికీ గణనీయమైన అభ్యాసం అందించాలని కోరుకుంటున్నామన్నారు.అభ్యాసకులు, కళ ఔత్సాహికులు ఇద్దరికీ ఆసక్తిని కలిగించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, సంగం ఉత్సవం ప్రపంచ స్థాయి భారతీయ శాసీ్త్రయ కళాకారులు దక్షిణాసియా కళలను సంరక్షించడం, ప్రోత్సహించడం ప్రదర్శించడం కోసం అంకితం చేయబడిందన్నారు. చైన్నెలోని మైలాపూర్ లోని భారతీయ విద్యాభవన్‌లో ఈనెల 31న ఈ వేడు క జరుగుతుందన్నారు. తంజావూరు హరిహరన్ హెరంబనాథన్, రాజ్‌కుమార్ భారతి, గోపికా వర్మలతో తంజావూరు క్వార్టెట్, క్రియేటివ్ సినర్జీ – సోలో థీమాటిక్ డ్యాన్సర్, కండేన్ స్వప్నం వంటి కార్యక్రమాలు ఈ వేడుకలు నిర్వహించబోతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment