క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Fri, Feb 21 2025 9:01 AM | Last Updated on Fri, Feb 21 2025 8:56 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

అర్జున్‌ సంపత్‌పై కేసు

సేలం: కోవైలో హిందూ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు అర్జున్‌ సంపత్‌పై సెల్వపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కోవై సెల్వపురం ఎస్‌ఐ దినేష్‌బాబు బుధవారం సామాజిక మాధ్యమాలను పరిశీలించారు. అప్పుడు ఎక్స్‌ సైట్‌ ద్వారా అర్జున్‌ సంపత్‌ మతపరంగా రెండు సామాజిక వర్గ ప్రజల మధ్య ఘర్షణలకు పాల్పడే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్‌ చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

కాలువలో పడి

అక్కాచెల్లెలు మృతి

అన్నానగర్‌: కాలువలో పడి అక్కాచెల్లెలు మృతిచెందారు. శివగంగై జిల్లా ఇలయయంకుడి సమీపంలోని అజిమదురై గ్రామానికి చెందిన శశికుమార్‌. ఇతని భార్య శరణ్య. వీరి కుమార్తె సోబిత (8). గ్రామంలోని పంచాయతీ యూనియన్‌న్‌ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. శశికుమార్‌ తమ్ముడు కన్నన్‌. ఇతని భార్య కృష్ణవేణి. వీరి కుమార్తె క్రిస్మికా (4). అంగన్‌న్‌వాడీ స్కూల్‌లో చదువుతుంది. ఈస్థితిలో బుధవారం బాలికలు ఇద్దరు యథావిధిగా పాఠశాల కు వెళ్లారు. విరామ సమయంలో ఇద్దరు కాలువ వద్దకు వెళ్లారు. అప్పుడు క్రిస్మిక కిందపడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోబిత కూడా కాలువలో పడింది. వీరిద్దరూ కాలువలో మునిగి మృతిచెందారు. మధ్యాహ్న భోజనానికి ఇద్దరిని తీసుకురావడానికి బాలికల తల్లిదండ్రులు వెళ్లారు. అక్కడ వారు కనిపించకపోవడంతో సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి చూడగా బాలికలు ఇద్దరు కాలువలో శవాలుగా తేలి ఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలిసి ఇలయంకుడి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. బాలికలు కాలువలో మునిగి మృతి చెందిన ఘటనలో పాఠశాలలో విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ఉపాధ్యాయురాలు మేరీ(59)ని విధుల నుంచి తొలగించినట్లు శివగంగై జిల్లా ప్రాథమిక విద్యాధికారి బాలుముత్తు తెలిపారు.

8 కిలోల

గుట్కా స్వాధీనం

– నలుగురి అరెస్ట్‌

అన్నానగర్‌: ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే రైలులో గుట్కాను అక్రమంగా తరలిస్తున్న నలుగురిని పెరంబూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల గుట్కా స్వాధీనం చేసుకున్నారు. చైన్నె సెంబియం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెరంబూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సెంబియం పోలీసులు పెట్రోలింగ్‌లో నిమగ్నమయ్యారు. పెరంబూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన నలుగురిని పెట్రోలింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. సోదాల్లో గుట్కాను ఉన్నట్టు గుర్తించారు. ఉత్తర రాష్ట్రాల రైళ్ల ద్వారా అక్రమంగా మాదక గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. అనంతరం నలుగురిని సెంపియం పోలీస్‌స్టేషన్‌న్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. విచారణలో వారు బిహార్‌కు చెందిన మహ్మద్‌ నవ్షాద్‌ (30), మహ్మద్‌ గుర్బాన్‌ (19), ఇమ్రాన్‌ (27), నీగల్‌ (22) అని తేలింది. పోలీసులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుట్కా, డ్రగ్‌ను అక్రమంగా తరలిస్తున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 8 కిలోల గుట్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని పోలీసులు కోర్టులో హాజరు పరచి జైలులో ఉంచారు.

చోరీ కేసులో

కారు డ్రైవర్‌ అరెస్ట్‌

అన్నానగర్‌: చోరీ కేసులో ఓ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైన్నె నుంగంబాక్కంలోని లేక్‌ వ్యూ అవెన్యూలోని 3వ క్రాస్‌కు చెందిన అబూబక్కర్‌ (53) వ్యాపారవేత్త. దుబాయ్‌లో ట్రేడింగ్‌ కంపెనీ ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేస్తున్నాడు. అబూబక్కర్‌ కుటుంబంతో కలిసి రెండంతస్తుల ఇంట్లోని మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు. 2వ అంతస్తులోని ఇంటిని అద్దెకు ఇచ్చాడు. కాగా, రామనాథపురం జిల్లా దిగువ ప్రాంతంలోని తమ ఇంట్లో వ్యాపారవేత్త అబూబకర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలకు వెళ్లారు. డిసెంబర్‌ చివరి వారంలో వెళ్లి జనవరి 3న చైన్నెకి తిరిగి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా లాకర్‌ పగులగొట్టి 150 సవర్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు మాయమయ్యాయి. అలాగే రూ.20 లక్షల నగదు, ఖరీదైన వాచ్‌ మాయమయ్యాయి. వ్యాపారి నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా వ్యాపారి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న చంద్రపరిబార్‌ అనే వ్యక్తి తన బంధువులతో చోరీ చేసినట్లు గుర్తించారు. చోరీలో వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన శాంత, గోరక్‌ సాయి, పవిత్ర, షాలిని, దీపక్‌ నగలు, నగదుతో నేపాల్‌కు పారిపోయినట్లు తెలిసింది. పోలీసులు కారు డ్రైవర్‌ చంద్రపరిబర్‌ను అరెస్టు చేశారు. నగలు, నగదుతో పాటు నేపాల్‌లో ఉన్న పనిమనిషి సహా ఐదుగురిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement