ఆ ఘనత ఉపాధ్యాయులదే..!
తమిళసినిమా: ‘ఇప్పుడు నేనున్న స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులే కారణమని, అందుకే నేను ఏం సాధించిన ఆ ఘనత వారికే అంకితం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని నటుడు నాగచైతన్య అన్నారు. చైన్నె వీఐటీలో 4 రోజులుగా జరిగిన వైబ్రేషన్స్ అంతర్జాతీయ కళా ఉత్సవం వేడుకలు శనివారంతో ముగిశాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వేలూరు) వీఐటీ ఫౌండర్, చాన్స్‌లర్ జి.విశ్వనాథన్, వైస్ చాన్స్‌లర్ జీవీ సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఏ స్థాయిలో ఉన్న దానిని తన ఉపాధ్యాయులకే అంకితం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. కళాశాలలో చదువుకున్న, చదువుకుంటున్నప్పుడు ఉపాధ్యాయుల ఆదరణ లభిస్తుందన్నారు. ఎన్నో కలలు కనాలని అనుకుంటున్నామో అన్ని కనబడుతున్నాయన్నారు. అయితే కళాశాల చదువు పూర్తి కాగానే బయట ప్రపంచంలోకి వెళ్లినప్పుడు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అది చాలా కఠినంగా ఉంటాయన్నారు. కళాశాల జీవితాన్ని విద్యార్థులు సంతోషంగా అనుభవిస్తూ, ఆనందంగా జీవించాలన్నారు. మానసిక వేదనకు గురి కారాదని, ఏ పని చేసినా 100 శాతం శ్రమించాలని పేర్కొన్నారు. అది విజయ్ అయినా సరే సాంస్కృతిక కళలు అయినా సరే అన్నారు. విద్యార్థులే దేశానికి భవిష్యత్తు అని, భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉంటుందన్నారు. జీవితంలో మీ వేగానికి ఆటంకం కలుగుతుందని, అయితే దాన్ని ఫుల్‌స్టాప్‌గా భావించరాదని పేర్కొన్నారు. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలని నాగచైతన్య సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment