విజయవంతంగా రన్‌ ఫర్‌ ది అన్‌ స్టాపబుల్‌ | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా రన్‌ ఫర్‌ ది అన్‌ స్టాపబుల్‌

Published Mon, Mar 3 2025 12:58 AM | Last Updated on Mon, Mar 3 2025 12:55 AM

విజయవంతంగా రన్‌ ఫర్‌ ది అన్‌ స్టాపబుల్‌

విజయవంతంగా రన్‌ ఫర్‌ ది అన్‌ స్టాపబుల్‌

సాక్షి, చైన్నె: రన్‌ ఫర్‌ ది అన్‌స్టాపబుల్‌ పేరిట ఆర్‌జీ ఇన్‌క్లూజివ్‌ మారథాన్‌ చైన్నెలో ఆదివారం విజయవంతంగా జరిగింది. పెద్దసంఖ్యలో దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు ఈ రన్‌కు తరలివచ్చారు. బీసెంట్‌ నగర్‌లోని ఓల్కాట్‌ మెమోరియల్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ నుంచి 11 విభాగాలతో ఈ రన్‌ నిర్వహించారు. ఇందులో 1,500 మందికి అధికం దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులుతరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక నేర విభాగం ఐజీ ఎం. సత్యప్రియ ఐపీఎస్‌, సుప్రీంకోర్టు న్యాయవాది ఎల్‌ఎల్‌ఎమ్‌ ఆర్‌. ప్రభాకరన్‌, చైన్నెలోని ఆర్‌జీ హాస్పిటల్స్‌ యూరాలజీ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ కె. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ రాజ్‌కుమార్‌ ముత్తు కృష్ణన్‌ , తమిళనాడు గవర్నర్‌, ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి డాక్టర్‌ సీకే గరియాలి, టీఎన్‌డీఎఫ్‌సీటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి. సిమ్మచంద్రన్‌, వేళచ్చేరి ఎమ్మెల్యే జెఎంహెచ్‌ హసన్‌ మౌలానా వంటి ప్రముఖులు పాల్గొని జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. పలు విభాగాలలో విజేతలుగా నిలిచిన వారికి షీల్డ్‌లను బహూకరించారు.

తరలి వచ్చిన ప్రత్యేక ప్రతిభావంతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement