బంగారు అడిగళార్‌కు పాదపూజ
కొరుక్కుపేట: ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగళార్ 85వ జయంతి వేడుకలను వేలాది మంది భక్తులు పాల్గొని వైభవంగా జరుపుకుంటున్నారు. వివరాలు.. మేల్ మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధర్ పీఠం చెందిన గురువు బంగారు అడిగళార్ 85వ జయంతి వేడుకలల్లో భాగంగా సోమవారం 3వ తేదీ ఉదయం ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠంలో గురుపీఠం, కాళీ దేవాలయం, ఓం మేదై, నాగ పీఠం, సిద్దర్ పీఠం తదితర ఆలయాలను పూలతో, రంగుల దీపాలతో అలంకరించారు. ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు పీఠం వద్ద సంగీతంతో కార్యక్రమాలు అలరిస్తున్నాయి . బంగారు ఆదికాలర్ విగ్రహానికి అభిషేక పూజలతో ప్రారంభమైంది. అనంతరం ఈనెల 2వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగళార్ స్వర్ణ రథోత్సవం చేపట్టారు అనంతరం ఆధ్యాత్మిక ఉద్యమ నాయకురాలు లక్ష్మీబంగారు అడిగళార్ పాద పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యక్షులు సెంథిల్ కుమార్ , శ్రీదేవి రమేష్ పూజలు నిర్వహించారు. అలాగే వేలాది మంది భక్తులు క్యూలలో వేచి ఉండి పాదపూజలు నిర్వహించారు. వేడుకలు సందర్భంగా మహా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో రూ.4 కోట్ల విలువైన సంక్షేమ సాయాన్ని ప్రత్యేక అతిథుల ద్వారా పేదలకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మేల్‌మరువత్తూరు ఆది పరాశక్తి స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్, సేలం నామక్కల్ జిల్లా అధికారులు, ఆదిపరాశక్తి ఉద్యమ వలంటీర్లు ఏర్పాట్లు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment