17 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
● ఇన్‌స్పెక్టర్‌కు పోలీసు కమిషనర్ అరుణ్ రివార్డు ● ముగింపుకొచ్చిన దోపిడీ కేసు ● ప్రధాన నిందితుడు ఇప్పటికే ఎన్‌కౌంటర్
కొరుక్కుపేట:. ఓ వ్యాపారికి తుపాకీ చూపి డబ్బులు దోచుకున్న కేసులో 17 ఏళ్లుగా పరారీలో ఓ నిందితుడిని అరెస్టు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌కు నగర పోలీసు కమిషనర్ అరుణ్ అభినందించి రివార్డు అందజేశారు. వివరాలు..2003 ఆగస్టు 13న చైన్నె కీల్పాక్కంలోని ఓ కంపెనీలోకి చొరబడి, ఉద్యోగినులను తుపాకీతో బెదిరించి దక్షిణాది జిల్లాలో పేరొందిన వెంకటేశ పన్నియార్ తన స్నేహితులతో కలిసి రూ.41.80 లక్షలు దోచుకెళ్లాడు. ఈ సంఘటన 2003 ఆగస్టు 13న చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడైన వెంకటేశ పెన్నియార్ నుంగంబాక్కం లేక్ సైడ్ రోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ బ్లాక్‌లో దాక్కుని ఉండగా అప్పటి చైన్నె మున్సిపల్ పోలీస్ కమిషనర్ విజయకుమార్ నేతృత్వంలోని పోలీసులు 2003 సెప్టెంబర్ 26న ఎన్‌కౌంటర్ చేశారు. కేసులో మిగిలిన 9 మందిలో ఏడుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. పరారీలో గోకుల్, జనార్థన్ కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు గాలించారు. 2017లో గోకుల్ మరణించాడు. ఈ నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బలగాలు గత 28వ తేదీన చైన్నెలోని ఎంజీఆర్ నగర్, కళ్యాణ్ నగర్, మూవేందర్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్న జనార్థన్‌ను అరెస్ట్ చేశారు. ఇతడు సాక్షాత్తు ప్రధాన నిందితుడు వెంకటేశ పన్నియార్‌కు అల్లుడు కావడం గమనార్హం! మొత్తానికి 17 ఏళ్లుగా కళ్లుగప్పి, ముప్పుతిప్పలు పెట్టిన జనార్థన్‌ను అరెస్ట్ చేయడంతో పోలీస్ కమిషనర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment