దివ్యాంగులకు స్కూటర్‌ల పంపిణీ
తిరువళ్లూరు: జిల్లాలోని అర్హులైన ఐదుగురు వికలాంగులకు మొదటి దశలో రూ.5.09 లక్షల విలువైన స్కూటర్‌లను కలెక్టర్ ప్రతాప్ సోమవారం ఉదయం అందజేశారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి 2 గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. సమావేశానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వేర్వేరు సమస్యలను పరిస్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంటి పట్టాల కోసం 157 వినతులు, సాంఘీక సంక్షేమ శాఖకు 66 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 70 , ఉపాధి కల్పించాలని 147 వినతులతో సహా మొత్తం 489 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ వివరించారు. వీటిని ఆయాశాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్, తక్షణం వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ తిరువళ్లూరు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment