● చెంగల్పట్టు కోర్టు సంచలన తీర్పు
కొరుక్కుపేట: 15 ఏళ్ల బాలికకు కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నిరూపణ కావడంతో చెంగల్పట్టు పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించడంతోపాటు బాధితురాలికి రూ.4లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వివరాలు.. చైన్నెలోని గిండి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. బాలిక సమీప బంధువులైన సెమ్మన్‌చేరికి చెందిన అర్జునన్ కుమారుడు అరవింద్ బంధువుగా బాలిక ఇంటికి వచ్చేవాడు. ఈ సందర్భంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం అవకాశంగా చేసుకుని కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకుఇచ్చాడు. బాలిక అపస్మారక స్థితిలో ఉండగా అరవింద్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు. లైంగిక దాడి గురించి ఎవరికై నా చెబితే ఇంటర్నెట్‌లో పెట్టి రోడ్డున పడేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 2019 చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇంటికొచ్చిన తన తల్లిదండ్రులకు బాలిక తనపై అరవింద్ చేసిన దారుణ అకృత్యాన్ని చెప్పడంతో వారు ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో కేసు తుది విచారణకు రాగా, చెంగల్పట్టు పోక్సో కోర్టు న్యాయమూర్తి నసీమా భాను అరవింద్‌ను దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. బాధిత బాలికకు రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి కేసును వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment