● తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని కడతేర్చిన వైనం
అన్నానగర్: తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడనే కోపంతో కన్న తండ్రినే కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఆపై మృతదేహాన్ని వీడియో తీసి బంధువులకు వాట్సాప్‌లో బంధువులకు పంపాడు. వివరాలు..రాజస్థాన్‌న్‌కు చెందిన జగదీష్ సంకల (42). ఇతని భార్య మోనికాదేవి. వీరికి కుమారుడు రోహిత్ (18) ఉన్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ చైన్నెలోని ఏళుకినారు ప్రాంతంలో ఉంటూ తంగసాలై ప్రాంతంలోని ఓ స్వీట్ షాపులో పనిచేస్తున్నారు.
మోనికాదేవి రాజస్థాన్‌న్‌లో ఉంటోంది. ఖాళీ దొరికినప్పుడల్లా తన భార్య వద్దకు జగదీష్ వెళ్లి వచ్చేవాడు. వెళ్లిన ప్రతిసారీ భార్యను కొట్టి, చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ విషయాన్ని చైన్నెలోని తన కుమారుడికి చెప్పి మోనికాదేవి కన్నీటిపర్యంతమయ్యేది. ఈ నేపథ్యంలో జగదీశ్ ఇటీవల రాజస్థానన్‌కు వెళ్లినప్పుడు మరోసారి తన భార్యపై ప్రతాపం చూపాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స అనంతరం ఆమె తిరిగి ఇంటికొచ్చింది. అలాగే చైన్నెకు వచ్చిన జగదీష్ ఈ ఉదంతాన్ని తన కుమారుడికి చెప్పడంతో.. అమ్మను ఎందుకు కొడుతున్నావంటూ తండ్రిని నిలదీశాడు. దీనిపై ఆదివారం రాత్రి తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం నిద్రలేచిన రోహిత్..తన తల్లిని అకారణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడనే క్షణికావేశంతో ఇనుపరాడ్‌తో తండ్రిపై దాడి చేశాడు. ఆ దెబ్బలకు జగదీష్ మరణించాడు. ఆ తర్వాత చైన్నెలోని తన బంధువు మంగారానికి ఫోన్ చేసి తండ్రిని కొట్టి చంపేసినట్లు చెప్పాడు. తండ్రి మృతదేహాన్ని వీడియోతీసి వాట్సాప్‌లో పంపాడు. తాను రాజస్థాన్‌కు విమానంలో వెళ్తున్నట్టు చెప్పాడు. మంగారం పోలీసులకు సమాచారం చేరవేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జగదీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రాజస్థాన్‌కు పారిపోయేందుకు సెంట్రల్ రైల్వేస్టేషన్లో రోహిత్ ఉన్నట్టు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిని అకారణంగా కొట్టడం, తన్నడం వలనే కోపంతో తండ్రిని హతమార్చినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment