డీఎంకే ప్రభుత్వంలోనే సంక్షేమం
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు విరివిగా అందుతున్నాయని డీఎంకే జిల్లా కార్యదర్శి, అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ 72వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం వేలూరులోని డీఎంకే కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి 72 కిలోల కేక్ కట్ చేసి 1,072 మందికి బిర్యానీతో పాటు సంక్షేమ పథకాలు పంపిణీ చేపట్టారు. అనంతరం పార్టీ జెండాను ఎగరవేవారు. భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుంటామని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలోనే మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు సౌకర్యం, బస్సు వసతి, కనీస వసతులు కల్పించామన్నారు. ప్రజా సంక్షేమం కోసం అవసరమైన పథకాలను సీఎం స్టాలిన్ ప్రవేశ పెడుతున్నారని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ, యూనియన్ చైర్మన్ అముద, మాజీ ఎమ్మెల్యే జయంతి, పార్టీ యూనియన్ కార్యదర్శి జ్ఞానశేఖరన్, కార్యకర్తలు అఽధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment