వధూవరులకు సీఎం ఆశీర్వాదం
అన్నానగర్: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన యువతికి ఆదివారం మధురైలో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పంపిన శుభలేఖను మంత్రి బి.మూర్తి వధూవరులకు అందించారు. మధురై జిల్లా చోళవందన్ సమీపంలోని తిరువేదకానికి చెందిన మనోహరన్ ఇతని భార్య మురుగేశ్వరి. వీరికి ఇద్దరు కుమార్తెలు. డ్రైవర్‌గా పనిచేస్తున్న మనోహరన్ అస్వస్థతకు గురికావడంతో పెద్ద కూతురు శోభన కాలేజీ చదువు ప్రశ్నార్థకంగా మారింది. తదనంతరం శోభన తన కళాశాల చదువు కోసం సహాయం చేయమని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆమెకి సహాయం చేయడంతో శోభన ప్రభుత్వ కళాశాలలో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత మధురై కార్మిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై ంది. మధురైకి చెందిన వీరమణి కార్తీక్‌ను శోభన వివాహం చేసుకుంది. శోభన, ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి శుభలేఖను అందించారు. శోభన–వీరమణి కార్తీక్‌ల వివాహం మధురైలోని తాళ్లకుళం పార్కులో మురుగన్ ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా దంపతులకు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి బి.మూర్తి వీరమణి కార్తీక్ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. శోభన మాట్లాడుతూ తన పెళ్లికి సీఎం స్టాలిన్ శుభాకాంక్షల సందేశం పంపడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment