మహిళా పోలీసులకు సీమంతం
అన్నానగర్: చైన్నెలోని అరుంబాక్కం పోలీస్‌స్టేషన్‌న్‌లోని క్రైమ్ బ్రాంచ్‌లో శరణ్య మహిళా పోలీసు అధికారిణి. అదేవిధంగా యోగమ్మాళ్ చూలైమేడు పోలీస్‌స్టేషన్‌న్‌లో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ గర్భిణులు. ప్రసవం కోసం సెలవు పెట్టి తమ ఇళ్లకు వెళ్లనున్నారు. గురువారం అరుంబాక్కం పోలీస్‌స్టేషన్‌న్‌లో వీరిద్దరికి సహచర పోలీసులు సీమంతం చేశారు. అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ స్నేహ ప్రియ ఇద్దరు గర్భిణులకు కంకణాలు వేసి గంధం పూశారు. అనంతరం పోలీసులు గంధం పూసి ఇద్దరికీ గాజులు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment