No Headline
తమిళసినిమా: ఇంతకుముందు కథానాయకలు ప్రతి నాయకలుగా నటించానికి భయపడేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పాత్ర బాగుంటే అది ఎలాంటిదైనా నటించడానికి సై అంటున్నారు. తాజాగా నటి వసుంధర అయితే తాను ప్రతినాయకి పాత్రలను చేయడానికి రెడీ అని బహిరంగంగానే ప్రకటించారు. అదీ మోడ్రన్ విలనిజంతో కూడిన పాత్రలు చేయడానికి ప్రాముఖ్యతనిస్తానని అంటున్నారు. దివంగత దర్శకుడు ఎస్పీ జననాథన్ తెరకెక్కించిన పేరాణ్మై చిత్రంలో ఐదుగురు యువ హీరోయిన్లలో ఒకరిగా పరిచయమైన నటి వసుంధర. అలా తొలి చిత్రంతోనే కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఈ భామ ఆ తరువాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అంతేకాదు పలు ప్రతినాయకి షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించి శభాష్ అనిపించుకున్నారు. అయినా సెలెక్టివ్ పాత్రల్లోనే నటించడం వల్ల ఇంకా తన పయనాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ నటిస్తున్న వసుంధర గత ఏడాది శివ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. దర్శకుడు శివ బక్రీద్ చిత్రంలో తన నటన చూసి ఆయన తనను కంగువ చిత్రంలో నటించడానికి పిలిచినట్లు చెప్పడంతో ఆడిషన్‌కు వెళ్లానని చెప్పారన్నారు. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు, అదీ ప్రతినాయకి షేడ్స్ కలిగిన పాత్రనేనని చెప్పారు. అదేవిధంగా తమిళంలో ఐశ్వర్యరాజేశ్ కథానాయకిగా నటిస్తున్న చిత్రంలో మోడ్రన్ విలనిజంతో కూడిన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. తాను శక్తివంతమైన మోడరన్ విలనిజంతో కూడిన పాత్రల్లో నటించడానికే ప్రాముఖ్యతనిస్తానని వసుంధర పేర్కొన్నారు. కాగా తెలుగుతో మంచి కథా చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, అందుకే ఇకపై తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మోడ్రన్ విలనిజానికి ప్రాముఖ్యతనిస్తా!
Comments
Please login to add a commentAdd a comment