ఆకాశ కోకిల
ఆకాశ కోకిల అనే ఈ పేరు వినగానే అందరి మదిలో మెదిలేది 40 సంవత్సరాలు తన కమనీయ కంఠంతో, చలాకీతనంతో శ్రోతలను ఉర్రూతలూగించిన ఆకాశవాణి చైన్నె కేంద్రం విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి. తను మూడో తరగతి చదువుకునే రోజుల్లోనే ఆకాశవాణి చైన్నె కేంద్రం నిర్వహించే ఆటవిడుపు పిల్లల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజగౌరి కాలక్రమేణా రేడియో అక్కయ్యగా పిల్లల కార్యక్రమం నిర్వహించే స్థాయికి ఎదిగారు. వృత్తిపై శ్రద్ధ, అంకిత భావం శ్రోతలతో పరస్పర అవగాహన ఆమెను వ్యాఖ్యాత స్థాయికి తీసుకెళ్లింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నాటకాలు నిర్వహించారు. గొప్పగొప్ప నటీనటులతో కలిసి నటించారు. స్వయంగా ఆమె చలన చిత్ర ప్రముఖులను శ్రోతలకు పరిచయం చేశారు. ప్రముఖులు రాసిన కథలను తన గళంతో చదివి అటు శ్రోతలకేకాక, కథలు రాసిన రచయితలను సైతం ఆకట్టుకున్నారు. ఆమె సమర్పించిన మధురం మధురం ఈ సమయం నేటికీ శ్రోతల మనస్సులో మెదులుతూనే ఉంది. – గజగౌరి
Comments
Please login to add a commentAdd a comment