అన్బళగన్‌కు అంజలి
సాక్షి, చైన్నె : డీఎంకే దివంగత ప్రధాన కార్యదర్శి అన్బళగన్ చిత్రపటానికి సీఎం స్టాలిన్‌తో పాటుగా డీఎంకే వర్గాలు నివాళులర్పించాయి. మాజీ మంత్రిగా, డీఎంకేకు కొన్ని దశాబ్దాల పాటుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నేత అన్భలగన్, దివంగత డీఎంకే అధినేత కరుణానిధికి అత్యంత సన్నిహిత మిత్రుడు. అలాంటి నేత అస్తమించి శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఆయన ఐదో వర్ధంతిని పురస్కరించుకుని డీఎంకే నేతృత్వంలో నివాళులర్పించే కార్యక్రమాలు జరిగాయి. వాడవాడలా డీఎంకే కార్యాలయాల్లో ఆ పార్టీ వర్గాలు అన్భలగన్ చిత్రపటాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించాయి. చైన్నె తేనాం పేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో అన్భలగన్ వర్ధంతి, నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ హాజరై, అన్బళగన్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు, డీఎంకే వర్గాలు ఆర్‌ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ తదతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్భళగన్‌ను స్మరిస్తూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. దివంగత నేత కరుణానిధికి అత్యంత సన్నిహితుడిగా, తమ లాంటి వారందరికీ మార్గదర్శకుడిగా, విద్యా మంత్రిగా తమిళనాట విద్యాభ్యున్నతికి అన్భళగన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. విద్యా పరంగా హక్కులను వదలుకోబోమని, ఇందుకోసం ఎలాంటి పోరాటాలకై నా సిద్ధం అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment