చైన్నెలో ‘ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ సదస్సు
సాక్షి, చైన్నె: దేశం మొదటిసారిగా హైపర్ టెన్షన్ కాంగ్రెస్ 2025 సదస్సుకు చైన్నె వేదికై ంది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ కార్యక్రమం చైన్నె ట్రేడ్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవం ఆదివారం జరగనుంది. 40 మంది అంతర్జాతీయ , 250 మంది జాతీయ వక్తలు, 1,700 మందికి పైగా ప్రతినిధులు ఒకే వేదిక పై హాజరయ్యారు. భారతదేశ జనాభాలో 32శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నందున వైద్యులు, నిపుణులు, పరిశోధకులు సహా ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఈ కాంగ్రెస్ సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, పరిశోధనా ఫలితాలను అధ్యయనం చేస్తున్నారు. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహన్ మాట్లాడుతూ అధిక రక్తపోటును నియంత్రించడం, హృదయనాళ భారాన్ని తగ్గించడం అనే థీమ్ అంశంతో ఈ కాంగ్రెస్‌లో విస్తృతమైన చర్చలు, మార్గదర్శకాలు, వివిధ మార్గాల అన్వేషన మీద దృస్టి పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజీవ్ గుప్తా, డాక్టర్ ఎస్. నరసింగన్, డాక్టర్ పాల్ కె వెల్టన్, డాక్టర్ జియా ఫ్రాంకో పరాటి పాల్గొన్నారు.
బాలికపై లైంగిక దాడి
●యువకుడికి 20 ఏళ్ల జైలు
సేలం : పుదుచ్చేరిలో చిన్నారిని చైన్నెకి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి హత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ఫాస్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. పుదుచ్చేరి కండెక్టర్ తోట్టం ప్రాంతానికి చెందిన కార్తిక్ (30) చైన్నెలో సినిమా ఔట్‌డోర్ యూనిట్‌లో పని చేస్తున్నాడు. ఇతని పుదుచ్చేరికి చెందిన ప్లస్– 2 చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ప్రేమ పేరిట చైన్నెకి తీసుకువెళ్లి తాంబరంలో అద్దె ఇంటిలో పెట్టాడు. గత 2022వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ నుంచి 2022వ సంత్సరం నవంబర్ 4వ తేది వరకు 20 రోజుల పాటు ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు ఓదియంసాలై పోలీసులు కిడ్నాప్, పోక్సో వంటి విభాగాల కింద కేసులు నమోదు చేసి కార్తీక్‌ను అరెస్టు చేశారు. పుదుచ్చేరి పోక్సో ఫాస్ట్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసులో న్యాయమూర్తి సుమతి శుక్రవారం నిందితుడు కార్తీక్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
73 ఏళ్ల హృద్రోగికి టీఏవీఆర్!
సాక్షి, చైన్నె: 73 ఏళ్ల గుండెజబ్బు ఉన్న రోగికి ప్రాణాలను రక్షించే టీఏవీఆర్ ప్రక్రియను నిర్వహించారు. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ గురించి అవగాహన పెంచే దిశగా గణనీయమైన ముందడుగులో భాగంగా కావేరీ హాస్పిటల్‌లోని టీహెచ్‌వీ థెరపీలోని సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజారామ్ అనంత రామన్ ట్రానన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ ప్రక్రియను విజయవంతం చేశారు. ఈ మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్ తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్, గుండె, మూత్రపిండాల వైఫల్యంతో సహా బహుళ కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 73 ఏళ్ల రోగికి నిర్వహించి, కొత్త జీవితాన్ని అందించారు. రోగికి గతంలో గుండెపోటు వచ్చింది, నిరంతర కాలు వాపు, తీవ్ర అలసట, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉండేవి. ప్రస్తుతం ఈ ప్రక్రియ తర్వాత కేవలం మూడు రోజులకే రోగిని డిశ్చార్జ్ చేశారు. రెండు నెలల్లోనే గుండె , మూత్రపిండాల పనితీరులో మెరుగుదల కనిపించడంతో అందరికీ అవగాహన కల్పించేలా ఈ వివరాలను వెల్లడించామని డాక్టర్ రాజారామ్ అనంతరామన్ తెలిపారు. కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
చైన్నెలో ‘ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ సదస్సు
Comments
Please login to add a commentAdd a comment