అన్నమయ్య వర్ధంతి మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి కల్చరల్: టీటీడీ, హిందూ ధార్మిక ప్రాజెక్టుల అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవాలు బుధవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం అలరింపజేసింది. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి దినం, ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి మహానివేదన చేపట్టారు. తరువాత చైన్నెకి చెందిన డాక్టర్ తాళ్లపాక మీనలోచని బృందం అన్నమయ్య సంకీర్తలను రాగయుక్తంగా గానం చేశారు. తర్వాత తిరుపతికి చెందిన జయంతి ,సావిత్రి బృందం ఆలపించిన ‘అన్నమయ్య జీవిత చరిత్ర’ హరికథాగానం సభికులను ఆకట్టుకుంది. సాయంత్రం అనూష, ఆర్తి బృందం ప్రదర్శించిన సంగీత కచేరి, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకుడు వెంకటేశ్వర్లు భాగవతార్ బృందం హరికథా గానం రసరమ్యంగా సాగింది.
అన్నమయ్య వర్ధంతి మహోత్సవాలు ప్రారంభం