
నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతాప్ మంగళవారం ఉదయం పరిశీలించారు. వెళ్లియ్యూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ వైద్యుల హాజరు, మందుల నిల్వలు, రోగుల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రోగులతో వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ఆయన సూచించారు. వైద్యశాలల్లో మందుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వేపబట్టు, పెరుమాళ్పట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పక్కా గృహాల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సైతం కలెక్టర్ అధికారులను ఆదేశించారు.