
సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అవగాహన సైకిల్ ర్యాలీ
కన్యాకుమారిలో కోలాహలం ముగింపు
సేలం : తూర్పు, పశ్చిమ సముద్రతీర రాష్ట్రాల ప్రజలలో అవగాహన కల్పించే రీతిలో సీఐఎస్‌ఎఫ్ చేపట్టిన 6,559 కిలో మీటర్ల దూరం సైకిల్ ర్యాలీ కన్యాకుమారిలో విజయవంతంగా ముగిసింది. సీఐఎస్‌ఎఫ్ తరపున బలమైన ఇండియా – సురక్షితమైన ఇండియా అనే నినాదంతో సముద్రతీర భద్రత, సముద్ర మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనుషుల కిడ్నాప్, మారణాయుధాల అక్రమ రవాణా వంటి వాటిని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత, మహిళా విద్య గురించి సముద్రతీర ప్రజల్లో అవగాహన కల్పించే రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ కన్యాకుమారిలో ఉన్న వివేకానంద స్మారకం వద్ద సోమవారం ముగించారు. 14 మంది మహిళలతో పాటూ 125 మందితో కూడిన ఈ బృందం సైకిల్ ర్యాలీ వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రా, పుదుచ్చేరి, తమిళనాడులో రామనాథపురం, తూత్తుకుడి మార్గంగా కన్యాకుమారికి చేరింది. ఈ సైకిల్ ర్యాలీ సోమవారం కన్యాకుమారిలో కోలాహలంగా ముగిసింది.
రేవతి రామచంద్రన్‌కు
నాట్యకళా సారథి అవార్డు
సాక్షి, చైన్నె : భారత నృత్య ఉత్సవ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డులతో మంగళవారం సత్కరించారు. ఇందులో రేవతి రామచంద్రన్‌కు నాట్య కళా సారథి అవార్డును ప్రదానం చేశారు. నారగ గాన సభలో శ్రీ పార్థసారథి స్వామి సభ వార్షిక నృత్యోత్సవం, భారత నృత్య ఉత్సవ్ 60 రోజుల పాటూ జరిగింది. ఈ వేడుకలో సోమవారం రాత్రితో ముగిశాయి. ఇందులో ఉత్తమ ప్రదర్శనలు కనబిరిన వారికి అవార్డులను మంగళవారం ప్రదానం చేశారు. ఇందులో ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రేవతి రామచంద్రన్‌కు నాట్యకళాసారథి అవార్డును అందజేశారు. ఈ ఉత్సవంలో ప్రదర్శన ఇచ్చిన 34 మంది కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త డాక్టర్ నల్లికుప్పుస్వామి చెట్టి, భరత నాట్య కారులు పద్మా సుబ్రమణ్యం , మీనాక్షి చిత్రరంజన్. ఎం కృష్ణమూర్తి పాల్గొని అవార్డు గ్రహీతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో భరతనాట్యం నర్తకులు శ్రీకళ భరత్, షీలా ఉన్నికృష్ణన్, లలితా గణపతి, ప్రముఖ నర్తకులు పాల్గొన్నారు. 60 రోజుల పాటూ జరిగిన ఈ నత్యోత్సవంలో 130 కి పైగా నత్య కార్యక్రమాలు జరిగాయి. భరతనాట్యం , మన భారతీయ శాసీ్త్రయ నత్యంలోని ఇతర విభాగాల నుంచి 175 మంది కళాకారులు, వర్ధమాన నత్యకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు.
పాత ట్రావెల్ కార్డును మరో 2 నెలలు పొడిగింపు
●మెట్రో రైల్ అధికారుల నిర్ణయం
కొరుక్కుపేట: చైన్నె మెట్రో రైల్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు కౌంటర్ల వద్ద ప్రయాణికుల పొడవైన క్యూలను నివారించేందుకు ట్రావెల్ కార్డ్ 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. 5 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది, ఈ కార్డ్ ఫీజులో 20 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇంతలో నేషనల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కార్డ్ (సింగార చైన్నె కార్డ్)ని మెట్రో రైల్వే కంపెనీ ఏప్రిల్ 14, 2023న ప్రవేశపెట్టింది. దీని తర్వాత చైన్నె మెట్రో కంపెనీకి చెందిన రైల్వే యుటిలిటీ కార్డులను రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని 41 మెట్రో రైల్ స్టేషన్లలో దశలవారీగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి, ప్రయాణికులు షెడ్యూల్ చేయబడిన రైళ్లలో ప్రయాణించడానికి, మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేయడానికి కార్డును ఉపయోగిస్తున్నారు. మంగళవారం నుంచి మెట్రో రైల్ ట్రావెల్ కార్డు పూర్తిగా మారుతుందని భావించిన ప్రయాణికులు ట్రావెల్ కార్డ్‌లోని మిగిలిన మొత్తాన్ని 4 అలందూరు సహా పలు మెట్రో రైల్ స్టేషన్ కౌంటర్లలో తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే పాత ప్రయాణంలో ఉన్న మొత్తాన్ని మినహాయించుకోవాలని వారు సమాధానమిచ్చారు. ట్రావెల్ కార్డ్‌లో జీరో వచ్చిన తర్వాత, సింగర చైన్నె కార్డుకు బదిలీ చేయాలి. అప్పటి వరకు మెట్రో రైల్ ట్రావెల్ కార్డు వినియోగాన్ని అనుమతించాలి కోరారు . దీనిపై మెట్రో రైలు సంస్థ అధికారులు పేర్కొంటూ.. ప్రయాణికులను సింగర చైన్నె కార్డుకు మార్చుకునేలా ప్రోత్సహిస్తున్నామని, ఈ ట్రావెల్ కార్డులో మొత్తం జీరోకు చేరిన తర్వాత రీఛార్జ్ చేయకుండానే సింగర చైన్నె కార్డు ఇస్తున్నామని చెప్పారు.

సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అవగాహన సైకిల్ ర్యాలీ