
గంటలో హౌస్‌ఫుల్!
● హాట్ కేక్‌ల్లా ఐపీఎల్ టికెట్లు
సాక్షి, చైన్నె: ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లో మారాయి. ఆన్‌లైన్‌లో 1.15 గంటల వ్యవధిలో వేలాది టికెట్లు బుక్కయ్యాయి. లక్ష మందికి పైగా టికెట్ల కోసం ఎదురు చూడగా చివరకు వేల మందికి టికెట్లు దక్కాయి. వివరాలు.. ఐపీఎల్ సీజన్ వేసవిలో మరింత ఉత్కంఠనురేపుతోంది. చైన్నెలోని చేపాక్కం స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఇప్పటికే 23,28 తేదీలలో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. మరో ఐడు మ్యాచ్‌లు ఇక్కడ జరగాల్సి ఉంది. తమిళనాడులోని క్రికెట్ అభిమానులు చైన్నె సూపర్ కింగ్స్ జట్టు తమదే అన్నట్టుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను తిలకించేందుకు ఉరకలు తీస్తున్నారు. ఇక్కడి ఇది వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో చైన్నె ఒక దాంట్లో గెలవగా, మరో దాంట్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక, ఈనెల 5వ తేదిన జరిగే మ్యాచ్‌లో ఢిల్లీని చైన్నె సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌కు గాను టికెట్ల అమ్మకాలు బుధవారం ఉదయం 10.15 గంటలకు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు. అప్పటికే లక్షల మంది వరకు అభిమానులు టికెట్ల కోసం ఆన్‌లైన్‌లతో తమ పేర్లు, వివరాలను పొందు పరిచి సిద్ధంగా ఉన్నారు. అయితే,ఒకొక్కరికి రెండు టికెట్లు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. దీంతో బుకింగ్ ఓపెన్ చేసిన 1.15 గంటలలో హౌస్‌ఫుల్ అయ్యాయి. తొలుత రూ.1,700 టికెట్లు, ఆతర్వాత సీ, డీ, ఈ కేటగిరిర గ్యాలరీ టికెట్లు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు. మొత్తంగా రూ. 1,700, రూ. 2,500, రూ. 3,500, రూ. 4,000, రూ. 7,500 ధర పలికిన టికెట్లు అన్నీ హౌస్ పుల్ అయ్యాయి. స్టేడియంలో సుమారు 50 వేల మంది కూర్చునేందుకు అవకాశం ఉంది. ఇ ందులో ప్రాంచైజీ, ఇతర ఉచిత టికెట్ల పొగా, మిగిలిన 35 వేల నుంచి 40 వేల మేరకు టికెట్లు ఆన్‌లైన్ ద్వారా విక్రయించినట్లు సమాచారం. ఇవన్నీ గంట వ్యవఽధిలో బుక్కయ్యాయి. టికెట్లు దక్కని వారికి నిరాశ తప్పలేదు. అదే సమయంలో టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ విక్రయాలు తరచూ వెలుగులోకి రావడంతో పోలీసులు నిఘాను మరింత పెంచారు. ఐపీఎల్ టికెట్ల బాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారి భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు.
చేపాక్కం స్టేడియం