
ఈ–పాస్ రద్దు చేయాలి
● ఊటీ, కొడైకెనాల్‌లలో 20 వేల దుకాణాలు మూత ● పర్యాటకులకు తప్పని పాట్లు ● అమ్మ క్యాంటిన్లు కిటకిట
సేలం: నీలగిరి జిల్లాలోని ఊటీ, కొడైకెనాల్ పర్యాటక కొండ ప్రాంతాలలో ఈ–పాస్ విధానం మంగళవారం నుంచి అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీలగిరి జిల్లాలోని వ్యాపారులు బుధవారం పూర్తి స్థాయి బంద్ చేపట్టారు. తమిళనాడులో వేసవి ప్రారంభం కావడంతో, ప్రజలు పర్యాటక ప్రదేశాలకు తరలిరావడం ప్రారంభించారు. దీంతో నీలగిరి, కొడైకెనాల్ ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఈ కారణంగా, ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ–పాస్‌ల కోసం నమోదు చేసుకునే విధానాన్ని గత ఏడాది ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా ఈ–పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు, మంగళవారం నుంచి ఊటీ ప్రాంతంలో సొంత లేదా అద్దె వాహనాల్లో ప్రయాణించే పర్యాటకులను వారాంతాల్లో ఈ ప్రాంతంలోకి అనుమతించాలని, వారాంతాల్లో గరిష్టంగా 8వేల వాహనాలను, వారపు రోజుల్లో 6వేల వాహనాలను అనుమతించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
వ్యాపారుల సమ్మె
దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ వ్యాపారుల సంఘం 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీని తరువాత, ఈ–పాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు మంగళవారం ఒక రోజు పూర్తి బంద్‌లో చేశారు. తేయాకు రైతుల నుంచి గ్రీన్ టీ ఆకులకు కనీస ధర, ఊటీ, కూనూరు మున్సిపల్ మార్కెట్ వ్యాపారుల డిమాండ్లను నెరవేర్చడం, ప్లాస్టిక్ నిషేధ చట్టానికి ప్రత్యామ్నాయ నిబంధన వంటి 13 అంశాల డిమాండ్ల కోసం ఒత్తిడి చేస్తున్న ఈ నిరసనలో జిల్లా అంతటా 20వేల దుకాణాలను మూసివేశారు.
పర్యాటకుల పాట్లు..
ఈ కారణంగా బుధవారం ఊటీ, కున్నూరు, కోత్తగిరి, గూడలూరు, కొడైకెనాల్, పట్టణ ప్రాంతాలు దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పర్యాటక వాహనాలు పనిచేయకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇంకా, నీలగిరి జిల్లాను సందర్శించే పర్యాటకులు, స్థానికులు ఆహారం, పాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అమ్మ క్యాంటీన్లలో ఆహారం కోసం ఎగబడ్డారు. జిల్లా వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లు కిటకిటలాడాయి.
బంద్ కారణంగా మూడపడిన దుకాణాలు, నిర్మానుష్యంగా ఊటీ

ఈ–పాస్ రద్దు చేయాలి

ఈ–పాస్ రద్దు చేయాలి