
శ్రీదేవి వారసురాలి ఎంట్రీ షురూ
తమిళసినిమా: దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఎదిగి ఉత్తరాది చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న పాన్ ఇండియా దివంగత నటి శ్రీదేవి. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో బాలనటిగా పరిచయమై ఆ తరువాత స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. కాగా ఇప్పుడు ఆమె వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరూ సినీ పరిశ్రమంలోనే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ముఖ్యంగా జాహ్నవి కపూర్ ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2018లో దడక్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రుహీ, గుడ్ లక్ జెర్రా, మిలీ తదితర చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ అభిమానులను అరెస్టు అంటూ ఉంటారు. కాగా ఈమె దక్షిణాది సినీ పరిశ్రమ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో చూశారు. అలా 2014లో దేవర చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. చిత్రంతోనే స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టడంతో ఈమె బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగులో మరో చిత్రం చేస్తున్నారు ఈసారి మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఈమె కోలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అన్న ఆసక్తి నెలకొంది. అలాంటిది రానే వచ్చింది. అయితే ఇక్కడ ఎంట్రీ చిత్రంతో కాదు వెబ్ సిరీస్‌తో అని తెలిసింది. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటి జాన్వీ కపూర్ కథానాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కళవాణి చిత్రం ఫేమ్ సర్గుణం ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారు. మహిళల పితృత్వంతో అనుబంధం ఉన్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. దీని షూటింగ్ జూలై నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఇది తమిళంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ అవుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో నిలబడే అవకాశం ఉంది.

శ్రీదేవి వారసురాలి ఎంట్రీ షురూ