
శాసీ్త్రయ కళలపై అభిరుచి పెంచాలి
● ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌రెడ్డి
కొరుక్కుపేట: శాసీ్త్రయ కళలపై చిన్ననాటి నుంచే చిన్నారుల్లో అభిరుచిని పెంచాలని తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కె.అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. చైన్నె టి.నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం–చైన్నె శ్రవణం హాలు వేదికగా భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ నృత్య గురువు రోజారాణి, ఆర్గనైజింగ్ డైరెక్టర్ దుర్జా నటరాజ్ నేతృత్వంలో భరతనాట్య ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ–చైన్నె ఏఈఓ పార్థసారథి, గౌరవ అతిథిగా అనిల్‌కుమార్‌రెడ్డి, ఆత్మీయ అతిథులుగా టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షులు నూతలపాటి శ్రీకృష్ణతోపాటు శంకర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా విశ్వ కామాక్షి కళాలయ గురువు డాక్టర్ నీరజ విశ్వనాథ్ శిష్యులు బృందంలోని 12 మంది చిన్నారులు ఆండాళ్ అరంగేట్రం, శ్రీ వెంకటేశ్వరస్వామి శ్లోకాలు , పాటలకు ఎంతో అద్భుతంగా భరతనాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను నయనానందపరిచారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం సంగీత, నృత్య కళలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఇలాంటి కళలను పరిపోషించడంతోపాటు భారతీయ శాసీ్త్రయ కళలపై చిన్నవయస్సు నుంచే పిల్లల్లో అభిరుచిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురువు రోజారాణి, వారి బృందానికి, చిన్నారులకు దేవుని అశీర్వాదాలు మెండుగా లభించాలని ఆకాంక్షించారు. గురువు రోజారాణి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నృత్య ప్రదర్శన ఇచ్చే భాగ్యం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ అవకాశం కల్పించిన టీటీడీ–చైన్నె వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. నృత్య ప్రదర్శన అందించిన చిన్నారులకు అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సపోర్టింగ్ డైరెక్టర్ ప్రణతిరెడ్డి, వ్యాఖ్యాత రోషిణి, సంగీత కళా ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.