
స్పా సెంటర్ మేనేజర్ అరెస్టు
యజమాని కోసం గాలింపు
తిరువొత్తియూరు: చైన్నెలో 13 చోట్ల స్పా సెంటర్ ప్రారంభించి అందులో వ్యభిచారం నడుపుతున్న మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని కోసం గాలిస్తున్నారు. చైన్నె, అన్నానగర్‌లో గత రెండు నెలల క్రితం స్పా అనే పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను ఉంచి వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం అందింది. అన్నానగర్ పోలీసులు వెంటనే ఆ స్పా సెంటర్‌కు వెళ్లి నిఘా వేశారు. ఆ సమయంలో మహిళలను ఉంచి వ్యభిచార వృత్తిని చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో స్పా సెంటర్‌లోకి చొరబడి తనిఖీ చేసి అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను విడిపించి చైన్నె మైలాపూర్‌లో ఉన్న మహిళ శరణాలయానికి అప్పగించారు. దీని తర్వాత ఇతర రాష్ట్రాల మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న మేనేజర్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్పా సెంటర్ యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.
● ఆవిష్కరణ
ఇటలీకి చెందిన యూఫోటాన్ సహకారంతో చైన్నెలోని స్పెక్ట్రా మెడికల్ ఇండియా ఎండోలిఫ్ట్ ఎక్స్‌ను ఆవిష్కరించింది. చర్మాన్ని బిగుతుగా చేయడానికి, కొవ్వును తగ్గించడానికి, ముఖం, శరీరాన్ని కనీస ఆకృతి చేయడానికి రూపొందించిన అధునాతన, శస్త్ర చికిత్స లేని లేజర్ చికిత్సతో కూడిన ఎండో లిఫ్ట్ ఎక్స్ పరికరాన్ని శనివారం స్థానికంగా స్పెక్ట్రా మెడికల్ సీఈఓ శ్రీరామ్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జయంతీ రవీంద్రన్, చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ శరణ్య, విఘ్నేష్, కార్తీక్, ప్రియం భగత్ పరిచయం చేశారు. దీని పనితీరును వివరించారు.
– సాక్షి, చైన్నె
● విరాళం
చైన్నెలోని నాలుగు పాఠశాలలకు రూ.28.6 లక్షలు విలువగల 26 స్మార్ట్ బోర్డులను ఈ విద్యా ప్రాజెక్టు ఆర్‌సీఎంటీ విరాళంగా అందజేసింది. వీటిని శనివారం నిర్వాహకులు రాజస్థాన్ రత్న కె.సుభాష్ చంద్ రాంకా, మహావీర్ బోత్రా, నీలకంఠన్ లోకనాథన్, నరేంద్ర శ్రీమల్ తదితరులు ఆయా పాఠశాలలకు అందజేసి, వాటి పనితీరును పరిశీలించారు. – సాక్షి, చైన్నె
దర్శకుడు నాగేంద్రన్ కన్నుమూత
తమిళసినిమా: కోలీవుడ్‌లో ఇటీవల వరుసగా వరుసగా విషాదఛాయలు నెలకొంటున్నాయి ఇటీవలే రచయిత దర్శకుడు భారతిరాజా వారసుడు నటుడు దర్శకుడు మనోజ్ హఠాత్తుగా కన్ను మూశారు. తాజాగా మరో మరణం సంభవించింది సినీ దర్శకుడు నాగేంద్ర శుక్రవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 50 ఏళ్లు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన ఆయన 2015లో నటుడు విమల్ కథానాయకుడుగా నటించిన కావల్ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కాగా స్థానిక అశోక్ నగర్‌లోని నటేశన్ రోడ్ లో నివసిస్తూ వచ్చారు. కాగా ఏడాది ముందు అనారోగ్యానికి గురై గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. కాగా శుక్రవారం రాత్రి నరేంద్రన్ హఠాత్తుగా మైకంతో పడిపోయారు. వెంటనే 108లో సమీపంలోని ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నరేంద్రన్ అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతిపై నిర్మాత సురేష్ కామాక్షి వంటి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

స్పా సెంటర్ మేనేజర్ అరెస్టు

స్పా సెంటర్ మేనేజర్ అరెస్టు