సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి పరీక్షలు కోటి దాటాయి. రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం కింద ఇప్పటివరకు 1.01 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 18న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడం తెలిసిందే.
ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 47.70 లక్షల మంది పురుషులు, 53.85 లక్షల మంది మహిళలు, 3,360 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వివిధ రకాల కంటి సమస్యలున్న వారిలో 16.33 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. చత్వారం సమస్యలున్న 12.31 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment