సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తిమ్మాపూర్ మండలం అలుగునూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రంలో 56 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 50 విద్యార్థులు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య బృందాన్ని సెంటర్‌కే పిలిపించి సీఈసీ సెంటర్‌లోని 206 మందికి యాంటీ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 56 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడతారని అధికారికంగా ఎంతమందికి పాజిటివ్ వచ్చింది చెప్పడం లేదు. చదవండి : కరోనా వ్యాక్సిన్‌ను అడ్డుకుంటారా ?!
సెంటర్ ప్రిన్సిపల్ సమ్మయ్య మాత్రం ముగ్గురికి మాత్రమే వచ్చిందని తెలిపారు. కాగా ఈ సెంటర్లో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు. పదవ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ చదువుకునే విద్యార్థులకు గత కొద్ది రోజుల నుంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు అభ్యర్థన మేరకే సెంటర్లో విద్యార్థులు ఉంచ్చుకొని క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. సి ఈ సి సెంటర్ లో పలువురికి పాజిటివ్ అని తేలడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: 50శాతం తగ్గనున్న సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీ సిలబస్?
Comments
Please login to add a commentAdd a comment