Social Welfare Hostel
-
ఇద్దరు ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: ఎమ్మెల్సీ కవిత
యాదాద్రి, భువనగిరి క్రైం: భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. అధికారులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైరంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నప్పట్టికీ విద్యార్థినుల మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేక పోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం హృదయవిధారకంగా ఉందని చెప్పారు. వారి సూసైడ్ లెటర్ పలు అనుమానాలకు తావిస్తున్నదని వెల్లడించారు. హాస్టల్ పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలన్నారు. హాస్టల్‌కు తరచూ బయటి వ్యక్తులు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం… హాస్టల్ వార్డెన్ , వాచ్మాన్ ,ఆటో డ్రైవర్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో హ్యాండ్ రైటింగ్ తమ పిల్లలది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ విషయంలో చిన్న ఘటన జరగగా తమ దృష్టికి వచ్చిందని, ఇది పక్కా హత్యే అని వారు మండిపడ్డారు. హాస్టల్లో ఇంతా జరగుతున్న వార్డెన్, యాజమాన్యం ఏం చేస్తున్నారని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వాచ్ మ్యాన్,ఆటో డ్రైవర్, వార్డెన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి
సాక్షి, నిర్మల్: సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయంతో పాటు అదే ప్రాంగణంలోని కస్తూరిబా విద్యాలయంలో శనివారం ఓ అగంతకుడు చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదుల్లో సంచరించాడు. గత గురువారం సైతం ఇదే విధంగా రావడంతో గమనించిన సిబ్బంది, విద్యార్థులు కేకలు వేశారు. వెంబడించడంతో పరారయ్యాడు. శనివారం రాత్రి సేమ్ సీన్ రిపీట్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి అక్కడికి చేరుకుని వి ద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. అగంతకుడు కేజీబీవీ వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాగ లతను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి రెండు సార్లు వచ్చిన విషయం వాస్తవమేనని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కేజీబీవీ ఎస్వో అన్నపూర్ణను వివరణ కోరగా.. వెనుకవైపు ప్రహరీని మూపివేయకపోవడంతో అగంతకుడు లోనికి వ చ్చాడని, ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. -
గురుకులంలో కరోనా కలకలం; 56 మందికి..
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తిమ్మాపూర్ మండలం అలుగునూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కేంద్రంలో 56 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 50 విద్యార్థులు, ఆరుగురు టీచర్లు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య బృందాన్ని సెంటర్‌కే పిలిపించి సీఈసీ సెంటర్లోని 206 మందికి యాంటీ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 56 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడతారని అధికారికంగా ఎంతమందికి పాజిటివ్ వచ్చింది చెప్పడం లేదు. చదవండి : కరోనా వ్యాక్సిన్‌ను అడ్డుకుంటారా ?! సెంటర్ ప్రిన్సిపల్ సమ్మయ్య మాత్రం ముగ్గురికి మాత్రమే వచ్చిందని తెలిపారు. కాగా ఈ సెంటర్లో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు. పదవ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ చదువుకునే విద్యార్థులకు గత కొద్ది రోజుల నుంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు అభ్యర్థన మేరకే సెంటర్లో విద్యార్థులు ఉంచ్చుకొని క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. సి ఈ సి సెంటర్ లో పలువురికి పాజిటివ్ అని తేలడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: 50శాతం తగ్గనున్న సీబీఎస్ఈ, సీఐఎస్సీ సిలబస్? -
‘అప్పుడే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారు’
సాక్షి, విజయవాడ : అంటరానితనం పోయినప్పుడే ఎస్పీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని జాతీయ ఎస్సీ కమీషన్ మెంబర్ రాములు అన్నారు. గురువారం ఆయన కస్తూరిబాయిపేటలోని సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఈ హాస్టల్లో త్రాగు నీటి సమస్య, దోమల బెడద ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. కిచెన్ సరిగాలేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో వసతులు మంచిగా ఉంటేనే విద్యార్థులు చదవుల్లో రాణిస్తారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు విద్య ముఖ్యమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని సూచించారు. కార్పొరేట్ విద్యార్థులతో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు పోటీపడి చదవాలన్నారు. ఒక్కో విద్యార్థి కి ప్రభుత్వం తరపున సంవత్సరానికి రూ. 2లక్ష ల50 వేలు ఖర్చు చేస్తుందని, దానికి తగ్గట్టుగా ఫలితాలు ఉండాలని సూచించారు. కులాల పేరుతో దూషించడం సబబు కాదన్నారు. గుంటూరులో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ కరవైతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు గుంటూరులో పర్యటించి శ్రీదేశి విషమై వివరణ కోరుతామని తెలిపారు. -
పేరెక్కదాయె.. బిల్లు రాదాయె..
సాక్షి, ఖమ్మం : సాంఘిక సంక్షేమ శాఖ ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల లెక్క పక్కాగా ఉంచడంతోపాటు.. వారి వివరాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేసేందుకు పూనుకుంది. వసతి గృహంలో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేలా గత ఏడాది నుంచి చర్యలు చేపట్టింది. అయితే కొత్త విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉంటే.. వాటిని సంక్షేమాధికారులు ఎస్సీ సంక్షేమ వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఆ ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి సమకూరే సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే కొత్త విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానం ఒక్క ఎస్సీ సంక్షేమ శాఖలోనే ఉండడం, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఇలాంటి విధానం లేకపోవడంతో ఆ శాఖల్లో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. జిల్లాలో 39 ప్రీ మెట్రిక్(పాఠశాలల విద్యార్థుల) వసతి గృహాలు ఉండగా.. వాటిలో మొత్తం 3,699 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 3వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారే. గత ఏడాది నుంచి ఆయా వసతి గృహాల్లో రెన్యూవల్ అయిన విద్యార్థులు 2,420 మంది ఉండగా.. కొత్తగా 1,279 మంది విద్యార్థులు వసతి గృహాల్లో చేరారు. అయితే పాత విద్యార్థుల వివరాలను రెన్యూవల్ చేయడమే కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. కొత్తగా చేరిన విద్యార్థుల విషయంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల కోసం ఎదురుచూపులు.. ఎస్సీ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుంటేనే వసతి గృహంలో డైట్, సోప్, ఆయిల్ బిల్లులు విద్యార్థులవారీగా విడుదలవుతాయి. కొత్తగా వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు స్టడీ, కండక్ట్తోపాటు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వారి ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. రెవెన్యూ అధికారులు వాటిని జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వసతి గృహాల సంక్షేమాధికారులకు అందజేయలేకపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా అవి ఇంతవరకు జారీ కాకపోవడంతో వసతి గృహాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రశీదు చూపించి చేరుతున్నారు. అయితే ఆన్లైన్లో విద్యార్థుల వివరాల నమోదు కోసం ధ్రువీకరణ పత్రాలు తప్పక అవసరం ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలలుగా నిలిచిన బిల్లులు.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభం కాగా.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు చేరారు. గత ఏడాది వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల వివరాలు రెన్యూవల్ కావడంతో వారికి ప్రభుత్వం నుంచి డైట్, సోప్ అండ్ ఆయిల్ బిల్లులు మంజూరవుతున్నాయి. అయితే కొత్త విద్యార్థుల వివరా లు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో రెండు నెలలుగా వారికి విడుదల కావాల్సిన డైట్, సోప్, ఆయిల్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో వసతి గృహ సంక్షేమాధికారులు అప్పు తెచ్చి మరి వారికి డైట్‌ను అందించడంతోపాటు పలు వసతి గృహాల్లో సోప్, ఆయిల్ బిల్లులను చెల్లిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి డైట్ కింద నెలకు రూ.950, సబ్బులు, ఆయిల్ కింద రూ.75 చొప్పున అందించాలి. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదైతేనే వారికి బిల్లులు విడుదల కానుండడంతో వసతి గృహ సంక్షేమాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు అప్పు తెచ్చి డైట్‌ను నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలి.. ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదైన విద్యార్థికే డైట్, ఇతర బిల్లులు చెల్లిస్తారు. కొత్తగా చేరిన విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక విద్యార్థులు వివరాలు నమోదు కావడం లేదని సంక్షేమాధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాగానే సదరు విద్యార్థులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తాం. – కస్తాల సత్యనారాయణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సడలింపు ఇవ్వాలి.. ఎస్సీ వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేస్తేనే బిల్లులు చెల్లిస్తారు. పలు కారణాలతో వసతి గృహాల్లో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు సకాలంలో ఆన్లైన్లో నమోదు కావడం లేదు. కొంత సడలింపు ఇచ్చి వివరాలు నమోదయ్యేలా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నిబంధనను తొలగించి, బిల్లులను విడుదల చేసి ఇబ్బందులను తొలగించాలి. అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలి. – తుమ్మలపల్లి రామారావు, తెలంగాణ వసతి గృహాల సంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
హాస్టల్లో పేలిన సిలిండర్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌లో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం లో సోమవారం సిలిండర్ పేలింది. దీంతో రేకులషెడ్డు, భవనం కాంపౌండ్‌వాల్ కూలిపోయాయి. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ప్రిన్సిపాల్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి గృహంలో 400 మంది విద్యార్థినులున్నారు. సాయంత్రం వంటమనిషి అనసూర్య వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ మాధవికి విషయం చెప్పింది. అప్రమత్తమైన ఆమె విద్యార్థినులను వెంటనే బయటకు వెళ్లాలని సూచించడంతో వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇంతలోనే భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మిగతా సిలిండర్లను తొలగించారు. భయాందోళనతో కన్నీరుమున్నీరవుతున్న విద్యార్థినులను వారు ఓదార్చారు. బాధ్యులపై చర్యలు: కొప్పుల ఘటన స్థలాన్ని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం రాత్రి సందర్శించారు. ఘటన జరిగిన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కోమటిలంక అమ్మాయి.. ఎదురుచూపు
కృష్ణాజిల్లా, ఏలూరు టౌన్ : కృష్ణాజిల్లా కైకలూరు మండలం కోమటిలంక గ్రామానికి చెందిన బలే నాగజ్యోతి 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి దూరమైంది. జ్యోతి తల్లి గంగ ఆమె చిన్నతనంలోనే చనిపోగా తండ్రి గోకణేషు 2006లో మృతి చెందాడు. జ్యోతికి ఒక అక్క ఉంది. వాళ్ల మేనత్త ఇద్దరినీ తాడేపల్లిగూడెం తీసుకెళ్లింది. వారిని పెంటపాడులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్పించింది. అయితే, నాగజ్యోతి అక్కడ ఉండేందుకు ఇష్టపడకుండా సొంతూరు వెళ్లింది. ఆమె బంధువులు మేనత్త వద్దే ఉండాలని చెప్పటంతో జ్యోతికి ఇష్టం లేక చెన్నై వెళ్లే రైలు ఎక్కేసి అక్కడకు చేరింది. కొంతకాలం చెన్నైలోని చైల్డ్‌లైన్‌లో ఉంది. జ్యోతి వివరాలు తెలుసుకుని ఆమెను ఏలూరు పంపారు. ప్రస్తుతం ఏలూరు హోంలో వసతి పొందుతోంది. జ్యోతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేనాటికి (2006, డిసెంబర్) ఆమెకు పదేళ్ల వయస్సు కావటంతో వారి బంధువుల పేర్లు, అడ్రస్ సరిగా చెప్పలేకపోతోంది. ఆమె తన బంధువులను కలుసుకునేందుకు ఎదురుచూస్తోంది. బంధువులు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై డి.గంగాభవానీ కోరుతున్నారు. వివరాలకు 91000 45424, 94906 95885 లో సంప్రదించాలన్నారు. -
ముగ్గురు హాస్టల్ బాలికల కిడ్నాప్
జయపురం: గత ఏడాది అక్టోబర్‌లో కొరాపుట్ జిల్లా కుందులి సమీప సొరిసిపొదర్ ఆదివాసీ సంక్షేమ పాఠశాలలో ఓ బాలికను నలుగురు అపహరించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారన్న ఆరోపణల అనంతరం బాలిక అత్మహత్యకు పాల్పడిన సంఘటన నేటికీ కొరాపుట్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తోంది. తాజాగా కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి పొరజబొడిపొదర్ గ్రామంలోగల ఆదివాసీ సంక్షేమ పాఠశాల హాస్టల్ ఉంటున్న ముగ్గురు ఆదివాసీ విద్యార్థినులను సోమవారం ఉదయం ఎవరో అపహరించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. మరోసారి కలకలం రేగింది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురిలో ఇద్దరు 6వ తరగతి విద్యార్థినులు కాగా మరో బాలిక 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 7గురు విద్యార్థినులు మూత్ర విసర్జనకు హాస్టల్నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో బొలెరో వాహనంలో కొందరు వచ్చి వారి ముఖాలపై టార్చిలైట్ వేయడంతో భయంతో నలుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారని, మిగతా ముగ్గురు విద్యార్థినులు కిడ్నాప్‌కు గురయ్యారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలికల తల్లిదండ్రులు వెంటనే పొరజబెడిపొదర్ గ్రామానికి వచ్చి అందరినీ అడిగిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల తరఫున ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
శిశువుకు జన్మనిచ్చిన ఐదో తరగతి విద్యార్థిని
గర్భిణి అని తెలిసి గోప్యంగా పాఠశాలకు పంపిన తల్లిదండ్రులు మండ్య : మలె మహాదేశ్వర బెట్ట (కొండ) ప్రాంతంలో ఐదో తరగతి బాలిక (14) తాను చదువుతున్న పాఠశాలలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్రూంకు తీసుకెళ్లారు. కొద్ది సేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈవిషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. బాలికను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. తమ కుమార్తె గర్భ దాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
హాస్టల్లో సిలిండర్ల పేలుడు: తప్పిన ముప్పు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సాంఘీక సంక్షేమ హాస్టల్లో సోమవారం సిలిండర్లు పేలాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాకపోతే రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిసింది. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బదిలీలు.. ఇష్టారాజ్యం
సాక్షి, కడప : చిన్నమండెం సాంఘిక సంక్షేమ హాస్టల్లో లక్ష్మికాంతమ్మ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. సాధారణంగా బదిలీలు జరగాలంటే మూడేళ్లు పూర్తి కావాలి. కానీ నిబంధనలకు నీళ్లు వదిలిన అధికారులు ఈమెను బదిలీ చేశారు. ఇంకా చాలామంది విషయంలోనూ ఇలాగే జరిగింది. బదిలీల విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌లు పెట్టి చెబుతున్నా జిల్లాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖతోపాటు వెనుకబడిన తరగతుల శాఖ హాస్టళ్ల వార్డెన్ల విషయంలోనూ అధికారులు ఎలా పడితే అలా బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైగా కొంతమంది వార్డెన్లు ఇప్పటికే మంత్రులు, జిల్లాకు సంబంధించిన టీడీపీ కీలక నేతల లెటర్ ప్యాడ్లను జతచేసి కావాలనుకున్న చోటికి బదిలీ చేయాలని దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. ఆయా శాఖలకు సంబంధించి ఏళ్లతరబడి సీట్లలోనే కూర్చొని ఫెవికాల్ వీరుల్లా ముద్రపడిన వారిని బదిలీ చేయకుండా.. కనీసం మూడేళ్లు కూడా పూర్తి చేసుకోని వారిని బదిలీ చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల విషయంలో వింత పోకడ : కొంతమంది ఎన్జీవో సంఘ నాయకుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు వింత పోకడ అవలంబిస్తున్నారని పలువురు వార్డెన్లు బహిరంగంగా పేర్కొంటున్నారు. సంఘంలో సభ్యులమంటూ కొందరు, మరో క్యాడర్ అంటూ ఇంకొందరు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తుండటంతో వారిని బదిలీ చేయకుండా ఆపారని పలువురు పేర్కొంటున్నారు. స్పౌజ్ కేసులను ప్రత్యేకంగా పరిగణించని అధికారులు : పులివెందుల నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ శాఖలో ఇద్దరు మహిళలు వార్డెన్లుగా పనిచేస్తున్నారు. వీరి భర్తలు కూడా టీచర్లుగా సమీప ప్రాంతాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భార్యాభర్తలు(స్పౌజ్) విషయంలో ప్రత్యేకంగా పరిగణించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఇద్దరు మహిళా వార్డెన్లను దూర ప్రాంతానికి బదిలీ చేశారు. ఇన్చార్జి మంత్రి కనుసన్నల్లోనే... జిల్లాలో బదిలీల ప్రక్రియ అంతా ఇన్చార్జి మంత్రి కనుసన్నల్లోనే కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి ఆదేశాలతోనే పలువురు వార్డెన్లను బదిలీ చేశారని.. స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలురైన వార్డెన్లను నియమించుకోవడంలో భాగంగా ఇన్‌ఛార్జి మంత్రికి జాబితా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బదిలీలు కొనసాగుతున్నాయని వినికిడి. బదిలీలపై ఆలోచించండి.. కలెక్టర్‌ను కలిసిన వార్డెన్లు : బదిలీల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ కె.వి.రమణను పలువురు వార్డెన్లు గురువారం కలిసి మాట్లాడారు. బదిలీలను కొద్దిరోజులు నిలిపివేయాలని కలెక్టర్‌ను వార్డెన్లు కోరినట్లు సమాచారం. తమ పిల్లలు ఒక ప్రాంతంలో చదువుతూ.. ఇప్పుడు మరొక ప్రాంతానికి బదిలీ అయితే సిలబస్‌తోపాటు ఇతర సమస్యలు ఎదురవుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. -
హాస్టల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
తిరుమలాయపాలెం : విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు సాం ఘిక సంక్షేమ హాస్టల్‌కు వచ్చిన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం హాస్టల్ నుంచి అదృశ్యమైన ఆ బాలిక హాస్టల్ ఆవరణలోని బావిలోనే మృతి చెంది ఉండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, స్థానిక విద్యార్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన బాణోత్ వీరన్న, మంగమ్మల మూడోకుమార్తె శిల్ప(13) మూడు సంవత్సరాలుగా ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న శిల్పను ఇటీవల హాస్టల్ ఎదురుగా ఉంటున్న కస్తూరి అనే మహిళ తన భర్తతో మాట్లాడుతున్నావంటూ తోటి విద్యార్థినుల ముందు అసభ్యకరంగా ధూషించింది. దీంతో మనస్తాపానికి గురైన శిల్ప తన తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానని చెప్పి బయటకువచ్చి తిరిగి హాస్టల్‌కు వెళ్ల లేదు. దీంతో హాస్టల్ వార్డెన్ శశిరేఖ గ్రామంలో శిల్ప గురించి విచారించినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల వద్దకు కూడా చేరకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థినిని ధూషించిన కస్తూరిని, ఆమె భర్త ఉపేందర్‌ను విచారించారు. ఈ క్రమంలో హాస్టల్ ఆవరణలోని బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో సిబ్బంది వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య, ఏఎస్డబ్ల్యూఓ యూసఫ్ అలీ, తహశీలాదర్ శివదాసు, ఎంపీడీఓ సన్యాసయ్య, ఎంపీపీ కొప్పుల అశోక్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై జాన్‌రెడ్డిలు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు... హాస్టల్ నుంచి బయటకువెళ్లిన బాలికతిరిగి హా స్టల్‌లోకి ఎలావచ్చింది.. ఆదివారం ఉదయం విద్యార్థినులంతా హాస్టల్లో ఉండగా బావిలో దూకి ఎలా ఆత్మహత్యకు పాల్పడింది.. అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బావికి పైకప్పుగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసినప్పటికీ రెండువైపులా మనుషులు ప్రవేశించే విధంగా వదిలేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన తమ కుమార్తె మృతి చెందిందనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తండ్రి వీరన్న కుమార్తె మృతదేహం ఉన్న బావిలో దూకేందు కు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తో టి విద్యార్థులు కూడా హాస్టల్లో జరిగిన సంఘటనతో భయబ్రాంతులకు గురయ్యారు. తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ తల్లిదండ్రులతో పాటు బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట బైఠాయించారు. తమ కుమార్తెను ఓ మహిళ కొట్టి, తిట్టిందనే విషయంపై హాస్టల్ అధికారులు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని, రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ధర్నా చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా వినలేదు. దీంతో సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య ప్రభుత్వ పరంగా విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తెస్తామని, హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్‌మెన్‌ను సస్పెండ్ చేస్తామని తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కాగా ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇంతకు ముందు నమోదు చేసి విద్యార్థిని అదృశ్యం కేసుతోనే పోలీసులు విచారణ చేపట్టారు. -
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వణుకు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 73 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 5,544 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత జూలైలో విద్యార్థులకు బెడ్షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దుప్పట్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 70 బీసీ హాస్టళ్లలో 4,560 మంది చదువుకుంటున్నారు. ఇందులో 2,755 మందికి విద్యా సంవత్సరం ప్రారంభంలో బెడ్షీట్ల్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. 1,805 మంది విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో చలికి వణుకుతున్నారు. జిల్లాలోని 123 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. మొదట్లో 34,354 మందికి బెడ్షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 4,800 బెడ్షీట్ల కోసం ప్రతిపాదనలు పంపించగా 2,100 ఇటీవల రావడంతో పంపిణీ చేశామని, మరో 2,700 ఈ వారంలో వస్తాయని చెబుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో గత మార్చిలో హాస్టళ్లలో తలుపులు, కిటికీల మరమ్మతుల కోసం రూ.78 లక్షలు మంజూరు కాగా, 17 హాస్టళ్లలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో రూ.30 లక్షలతో 11 హాస్టళ్లలో మరమ్మతుల పనులు మంజూరు కాగా, అవి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. బీసీ హాస్టళ్లకు సంబంధించి ఇటీవల రూ.58 లక్షలతో 34 హాస్టళ్లలో మరమ్మతులు నిర్వహించామని, మిగతా హాస్టళ్లలో సమస్యలు లేవని అధికారులు చెబుతుండగా ‘న్యూస్‌లైన్ విజిట్’లో అనేక బీసీ హాస్టళ్లలో కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. హాస్టళ్లలో విద్యార్థుల గజగజ ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాలో కిటికీలకు తలుపు లేకపోవడంతో రాత్రి వేళ చల్లని గాలిని విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారు. గజగజ వణుకుతూనే నిద్రపోతున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న చిరిగిన బొంతలను కప్పుకుని చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. బేలలోని కస్తూర్భా పాఠశాలలో కిటికీలకు జాలీలు విరిగిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. చెన్నూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో దుప్పట్లు పంపిణీ కాకపోవడంతో చలికి వణుకుతూనే పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. జైనూర్ మండలం మర్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటే చల్లటి నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గం వసతి గృహాల్లోని విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. అయితే కొన్ని వసతిగృహాలకు అధికారులను దుప్పట్లు అప్పగించినప్పటికీ మరికొన్ని వసతిగృహాల్లో అందించలేదు. నిర్మల్ బీసీ వసతి గృహం, సారంగాపూర్ మండలం జామ్ ఎస్సీ వసతి గృహాల్లో గదులకు సరైన కిటికీలు, తలుపులు లేవు. నిర్మల్ బీసీ వసతి గృహంలో కిటికీలకు, గదులకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జామ్ ఎస్సీ వసతి గృహానికి సరైన కిటికీలు లేక విద్యార్థులు చలికి వేగలేకపోతున్నారు. దిలావర్పూర్ బీసీ వసతి గృహం కొత్తగా నిర్మించారు. అయితే స్నానపు గదుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. బెల్లంపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 20 మందికి, బెల్లంపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం విద్యార్థులు 24 మందికి దుప్పట్లు పంపిణీ చేయలేదు. -
సాంఘిక సంక్షేమ హాస్టల్లో విజయమ్మ తనిఖీ