ఎన్ఎస్సీ క్యాంప్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వసతి గృహంలోని సౌకర్యాలలేమీని విద్యార్థులు విన్నవించారు. హాస్టల్లో నెలకొన్న సౌకర్యాలలేమీపై వైఎస్ విజయమ్మ వార్డెన్ను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థినీలకు నోట్‌పుస్తకాలను వైఎస్ విజయమ్మ పంపిణి చేశారు. నల్గొండ జిల్లాలోని కోదాడాలో బుధవారం వైఎస్ విజయమ్మ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం అమె ఖమ్మం జిల్లాకు పర్యటనకు వెళ్లారు. -