'సొంత ఖర్చుతో 8 అంబులెన్సులు ఏర్పాటు చేస్తా' | 8 Ambulances For Sangareddy Constituency Says Jaggareddy | Sakshi
Sakshi News home page

'సొంత ఖర్చుతో 8 అంబులెన్సులు ఏర్పాటు చేస్తా'

Published Tue, May 25 2021 3:54 AM | Last Updated on Tue, May 25 2021 3:54 AM

8 Ambulances For Sangareddy Constituency Says Jaggareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం సొంత ఖర్చు తో త్వరలోనే 8 అంబులెన్సులు ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. సోమవారం గాంధీభవన్‌లో తన కుమార్తె, కాంగ్రెస్‌ యువ నాయకురాలు జయారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

మూడు రోజుల్లో నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 మున్సి పాలిటీలకు 6 అంబులెన్సులు ఏర్పాటు చేస్తానన్నారు. కోవిడ్‌ బాధితులు, అత్యవసరం ఉన్న ప్రజలు ఈ అంబులెన్సులను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. నియోజకవర్గంలోని ఏ గ్రామం నుంచి ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి అంబులెన్సులు తెప్పించుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement