సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయి ‘స్కోచ్ సిల్వర్’ అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో రెండోస్థానం పొందిన ఆగ్రోస్‌కు మంగళవారం ఆన్‌లైన్ ద్వారా అవార్డును అందజేశారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆగ్రోస్ ఎండీ రాములును వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు సత్కరించారు.
నిరుద్యోగ గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రైతుసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాములు వివరించారు. వాటి ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను నేరుగా అందిస్తున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్‌రావు ప్రోత్సాహంతో ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment