సాక్షి, హైదరాబాద్: టీజీపీఎస్సీ 783 గ్రూప్-2 పోస్టులకు రాతపరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు డిసెంబర్ 15, 16వ (ఆది, సోమవారం) జరగనున్నాయి. ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాలు సిద్ధమయ్యాయి.
గ్రూప్-2 పరీక్షల ఇలా..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.
అలాగే డిసెంబరు 16వ తేదీన పేపర్-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-4 పరీక్షను మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 600 మార్కులు ఈ గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు.
ఒకే రోజు గ్రూప్2,రైల్వే పరీక్షలు
అంతకుముందు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లలో డిసెంబర్ 16న రైల్వే పరీక్ష ఉందని, ఒకే రోజు గ్రూప్-2, రైల్వే పరీక్షలు ఉన్నందున పరీక్షను వేరే తేదీకి మార్చాలని కోరారు.
దీనిపై విచారణ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సందర్భంగా గ్రూప్-2 వాయిదా వేయడం వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులంతా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment