group 2 exams
-
గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్
-
గ్రూప్-2 అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట
-
గ్రూప్-2 పరీక్ష : ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, కీలకమైన గ్రూప్-2 పరీక్ష నిర్వహణలో అధికారులు పలు పొరపాట్లకు తావిచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం ఆలస్యం వెలుగుచూసింది. పరీక్షా కేంద్రం కేటాయించకుండానే గ్రూప్-2 పరీక్ష కోసం అభ్యర్థులకు అధికారులు హాల్ టికెట్లు పంపించారు. దీంతో పలువురు అభ్యర్థులు చిత్తూరులోని పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి.. హాల్టికెట్లలో పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా లేకపోవడంతో వెనుదిరిగారు. విజయనగరంలో 34 పరీక్షా కేంద్రాలు విజయనగరం జిల్లా లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కోసం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 13,145 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మొత్తం 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు జరిగే ఈ పరీక్షకు 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టంచేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలన్నారు. గ్రూప్-2 కోసం మొత్తం 2 లక్షల 95వేల 36 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకూ 2.30 లక్షలమందికి పైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 727 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. -
గ్రూప్–2 అభ్యర్థులకు ‘ఫొని’ ఎఫెక్ట్
సాక్షి, గుంటూరు: ఫొని తుపాను ప్రభావం గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులపై పడింది. 446 గ్రూప్–2 పోస్టులకు ఈ నెల 5న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2.95 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఫొని తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దాదాపు 80 రైళ్లను రద్దు చేసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం ఎక్కువ ఉన్న ఉత్తరాంధ్రలో అభ్యర్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం చాలా మంది అభ్యర్థులు హైదరాబాద్, విశాఖ తదితర నగరాల్లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–2 పరీక్షకు హాజరయ్యేందుకు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి వీరంతా రైళ్లు, బస్సులకు రిజర్వేషన్ చేయించుకున్నారు. ఫొని తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే 80 వరకు రైళ్లను రద్దు చేసింది. రోడ్డు మార్గంలో చేరుకోవాలన్నా ఉత్తరాంధ్ర సహా తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలు, తీర ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి సెలవులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2కు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏ, కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితి. పరీక్ష వాయిదా వేయాలి అభ్యర్థులు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం ఏపీపీఎస్సీ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. పరీక్షలను వెంటనే వాయిదా వేసి అందరూ హాజరయ్యే విధంగా మళ్లీ నిర్వహించాలి. – సమయం హేమంత్ కుమార్,ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పరీక్ష కేంద్రాలకు వెళ్లడం కష్టమే మాది కొత్తపాలెం గ్రామం. నేను గ్రూప్–2 పరీక్ష రాయాల్సిన కేంద్రం టెక్కలిలో ఉంది. తుపాను నేపథ్యంలో మా ప్రాంతంలో రవాణాకు తీవ్ర అంతరాయం నెలకొంది. పరీక్ష వాయిదా వేస్తే బాగుంటుంది. – జి.లక్ష్మి, గ్రూప్–2 అభ్యర్థిని, శ్రీకాకుళం జిల్లా ప్రైవేట్ రవాణా ఏర్పాటు చేసుకోవాలన్నారు ఫొని తుపానుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కోరగా ఆయన ప్రైవేట్ రవాణా ఏర్పాటు చేసుకుని పరీక్షకు హాజరుకావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. – ఎస్.మహబూబ్ బాషా, ఏపీ నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపకుడు -
మే 5నే గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 5న గ్రూప్–2 పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షను యథాతథంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్–2 కింద 446 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే, సాధారణ ఎన్నికలు రావడంతో ప్రిపరేషన్‌కు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయని, పరీక్షను నెలపాటు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు, పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధానాధికారికి విన్నవించారు. అయితే, పరీక్షను ముందుగా ప్రకటించిన విధంగా మే 5నే నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే హాల్‌టిక్కెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులంతా చాలాకాలం నుంచి ప్రిపరేషన్లో ఉన్నారని, ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం వల్ల వారంతా నిరాశానిస్పృహలకు లోనవుతారని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పరీక్షను వాయిదా వేస్తే ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడానికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి. పరీక్ష వాయిదా వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందని, అందుకే సకాలంలో పరీక్ష నిర్వహించాలని వివరిస్తున్నాయి. గ్రూప్–2 పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 773 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష పెన్ను–పేపర్ (ఓఎమ్మార్ పత్రాలు) విధానంలో జరగనుంది. తప్పు సమాధానాలకు 1/3 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. 446 పోస్టుల్లో 110 పాత పోస్టులే మొత్తం 446 గ్రూప్–2 పోస్టుల్లో 110 పోస్టులు పాత నోటిఫికేషన్లలో భర్తీ కాకుండా క్యారీ ఫార్వార్డ్ కింద ఈ నోటిఫికేషన్లో చేరాయి. 446 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 154 కాగా, తక్కినవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులే. క్యారీ ఫార్వార్డ్ కింద చేరిన 110 పోస్టుల్లో 16 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, తక్కినవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. వైట్నర్ పెడితే తిరస్కరణ కాగా, ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షల్లో పలువురు అభ్యర్థులు అనేక పొరపాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ గుర్తించింది. కొంతమంది ఓఎమ్మార్ పత్రాల్లో వివరాలను సరిగా నింపలేదు. కొంతమంది బబ్లింగ్ కూడా సరిగా చేయలేదు. కొంతమంది బబ్లింగ్ చేసి తర్వాత వాటిని వైట్నర్తో చెరిపేసి మళ్లీ బబ్లింగ్ చేశారు. ఇలా చేయడంతో ఆయా అభ్యర్థుల పత్రాలు స్కానింగ్ సమయంలో తిరస్కరణకు గురవుతాయని కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయొద్దని సూచిస్తున్నాయి. ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరి మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో కొన్ని కేటగిరీల వారికి ‘ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్’ టెస్టును తప్పనిసరి చేశారు. మొత్తం 15 విభాగాల పోస్టుల అభ్యర్థులు దీన్ని రాయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో మెరిట్ సాధించి పోస్టులకు ఎంపికయ్యే అవకాశాలున్నా ఈ ప్రొఫిషియెన్సీ టెస్టులో కూడా ఉత్తీర్ణత సాధిస్తేనే వారిని పోస్టుకు ఎంపిక చేస్తారు. ప్రొఫిషియెన్సీ టెస్టు తర్వాత మాత్రమే అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. జూలై 18, 19 తేదీల్లో మెయిన్ పరీక్షలు ప్రిలిమ్స్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించినవారిని వారి రిజర్వేషన్లకనుగుణంగా 1:12 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు తగినంతమంది మెయిన్స్ పరీక్షలకు ఎంపిక కాకుంటే ఆ కేటగిరీల వరకు కటాఫ్ మార్కులు తగ్గించి మిగతా వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఇలా ప్రత్యేక కటాఫ్ మార్కుల మినహాయింపు ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసి మెరిట్ సాధించినవారు జనరల్ కోటా పోస్టులకు కాకుండా రిజర్వుడ్ కోటా పోస్టులకు మాత్రమే పరిమితమవుతారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపికైనవారికి జూలై 18, 19న కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. -
పరీక్ష పారదర్శకంగా నిర్వహించాం
-
గ్రూపు-2 పరీక్ష వాయిదా..
► అదనపు పోస్టులు వచ్చాకే.. ► అధికారికంగా వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూపు-2 పోస్టుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన గ్రూపు-2 పరీక్షను టీఎస్పీఎస్సీ అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 439 గ్రూపు-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. వాటికి మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోస్టులు తక్కువగా ఉండటం, అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో వాటి సంఖ్యను పెంచాలన్న డిమాండ్ పెరిగింది. అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు పలువురు అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ముందుగా ఇచ్చిన 439 పోస్టులకు అదనంగా మరో 1000 పోస్టులను ఇస్తామని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రకటించారు. దీనిపై టీఎస్పీఎస్సీకి అధికారిక సమాచారం రావడంతో, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.